- మెజార్టీ స్థానాలు గెలుచుకున్న బి ఆర్ ఎస్ పార్టీ
మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. జిల్లాలో మూడు మున్సిపాలిటీ లకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీల మధ్య ఉత్కంఠగా ఓట్ల లెక్కింపు కొనసాగింది. ఎల్లంపేట్ మున్సిపాలిటీలో 24 వార్డులో జరిగిన ఎన్నికల్లో 12 స్థానాల్లో బిఆర్ఎస్ పార్టీ, 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 4 స్థానాల్లో భాజపా పార్టీ గెలుపొందాయి. ఛైర్మన్ పీఠానికి బలం లేకపోవడంతో అన్ని పార్టీలు వారివారి గెలుపొందిన అభ్యర్థులతో క్యాంపు రాజకీయాల్లోకి వెళ్లాయి. జిల్లాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ శాతం ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపినట్లు ఫలితాలు బట్టి తెలుస్తుంది.
ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇలా..
1వ వార్డు – మామిళ్ళ బాలమణి విజయం (కాంగ్రెస్), 2వ వార్డు – భూక్య శారద నాయక్ (భాజపా), 3వ వార్డు – గూడూరు విజయలక్ష్మిమాధవ రెడ్డి (కాంగ్రెస్), 4వ వార్డు – శాంతిరాజు (కాంగ్రెస్), 5వ వార్డు – నునావత్ పార్వతితార్య నాయక్ (కాంగ్రెస్), 6వ వార్డు – గుమ్మడిదల మహేశ్వరి (భాజపా), 7వ వార్డు – బందెల కుమార్ (బిఆర్ఎస్), 8వ వార్డు – లావుడియా శ్రీదేవిరమేష్ నాయక్ (బిఆర్ఎస్), 9వ వార్డు – మాలోత్ రజిత (బిఆర్ఎస్), 10వ వార్డు – శ్రీలత రమేష్ (బిఆర్ఎస్), 11వ వార్డు – గోషిక అఖిల విజయం (బిఆర్ఎస్), 12వ వార్డు – కల్పన మాణిక్య రావు (బిఆర్ఎస్),
13వ వార్డు – సారా ముత్యాల్ గౌడ్ (కాంగ్రెస్), 14వ వార్డు – ఎర్రవల్లి విఘ్నేశ్వర్ రెడ్డి (కాంగ్రెస్), 15వ వార్డు – వేణు గౌడ్ (కాంగ్రెస్), 16వ వార్డు – సురేష్ రెడ్డి (బిఆర్ఎస్), 17వ వార్డు – దాది నర్సింహా (బిఆర్ఎస్), 18వ వార్డు – ఓం ప్రకాష్ గౌడ్ (బిఆర్ఎస్), 19వ వార్డు – మేకల రజితదేవేందర్ రెడ్డి (భాజపా), 20వ వార్డు – కత్తి వరలక్ష్మిసురేందర్ (బిఆర్ఎస్), 21వ వార్డు – చిన్నోళ్ల భాస్కర్ (బిఆర్ఎస్), 22వ వార్డు – సద్ది నిషిత రెడ్డి విజయం (బిఆర్ఎస్), 23వ వార్డు – మహమ్మద్ హారీఫ్ (కాంగ్రెస్), 24వ వార్డు – వచపల్లి అర్చన (భాజపా)
