- కౌన్సిలర్ వాచపల్లి అర్చన శ్రీనివాస్
24వ వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎల్లం పెట్ మున్సిపల్ 24వ వార్డు కౌన్సిలర్ వాచపల్లి అర్చన శ్రీనివాస్ అన్నారు, ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎల్లంపేట్ గ్రామంలో ఉన్న దుర్గమ్మ ఆలయం వద్ద గత కొంత కాలంగా ఆలయానికి విచ్చేసి భక్తులు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు అని గమనించి, తన సొంత ఖర్చులతో నీరు నిలువ ఉంచే సంపును ఏర్పాటు చేశామని తెలిపారు,తనను నమ్మి బారి మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఎప్పటికి రుణ పడి ఉంటానని కొనియాడిన అర్చన శ్రీనివాస్24వ వార్డ్ కౌన్సిలర్.
- Advertisement -
