మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్
పాలిచ్చే మూగజీవాలనే కాదు.. నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరినీ కాపాడే వాడే “యాదవుడు” (Yadavs) అని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు. మేడ్చల్ (Medchel) నియోజకవర్గంలోని బోడుప్పల్ (Boduppal) మున్సిపల్ కార్పొరేషన్ యాదవ్ సంఘం నిర్వహించిన సదర్ (Sadar) మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్, మేడ్చల్ నియోజకవర్గ బీ బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, బోడుప్పల్ యాదవ్ సంఘం అధ్యక్షుడు తోటకూర రవీందర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి జనగే వెంకటేష్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు, యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

