- వటపత్రశాయిగా,యాదాద్రి నరసింహుడు.
- న భూతో న భవిష్యతిగా నిర్వహింపబడుతున్న యాదాద్రి ఉత్సవాలు.
- విద్యుత్ దీపాలతో బంగారు కొండను తలపిస్తున్న యాదాద్రి
- సాయంత్రం హంస వాహన సేవపై విహరించనున్న స్వామి వారు
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 18వ తేదీ నుండి ప్రారంభమైన యాదాద్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహింపబడుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం స్వామివారిని వటపత్రశాయి అలంకారముగా స్వామివారిని అలంకరించి భక్తుల దర్శనార్ధం ఆలయ మాడవీధులలో భక్తుల దర్శనార్థం ఊరేగించారు.ఉదయం ఆలయంలో నిత్య ఆరాధనల అనంతరం ఉదయం 10 గంటలకు స్వామివారిని అలంకరించి భక్తకోటికి దర్శనం కల్పించారు.

వటపత్రశాయి అలంకార సేవ ప్రత్యేకత:
వటపత్ర మనగా మర్రిఆకు,వటపత్రశాయి అలంకారం అంటే శ్రీమహావిష్ణువు ప్రళయ కాలంలో మర్రి ఆకుపై పవళించిన రూపం.ఈ అలంకారంలో స్వామివారు చిన్నారి బాలకృష్ణుడిగా తన కాలి వేలిని నోట ఉంచుకుని దర్శనమిస్తారు.ఈ రూపం సృష్టి ఆదిని మరియు అంతాన్ని సూచిస్తుంది.అల్లరి కృష్ణుడి చిద్విలాసాన్ని, అమాయకత్వాన్ని ఈ అలంకారం ప్రతిబింబిస్తుంది.ఆలయ అర్చకులు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తుల దర్శనార్థం ఆలయ తిరుమాడ వీధులలో ఊరేగిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు కాండూరి వెంకటాచార్యులు, ప్రధానార్చకులు సురేంద్రాచార్యులు,ఆలయ చైర్మన్ నరసింహమూర్తి ఈవో భవాని శంకర్ జిల్లా కలెక్టర్ హనుమంతరావు డిఇఓ దోర్బల భాస్కర్ శర్మ, మున్సిపల్ చైర్మన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, ఏఈఓ గజవెల్లి రఘు,ఉప ప్రధానార్చకులు మంగళగిరి నరసింహమూర్తి,లక్ష్మణాచార్యులు, ముఖ్య అర్చకులు గట్టు వెంకటాచార్యులు, కిరణ్ కుమారాచార్యులు,సూపరింటెండెంట్ సీతారామ చారి ఎస్పీఎఫ్ సిఐ శేషగిరిరావు, తదితరులు ఉన్నారు.


