బంగ్లాదేశ్ ముఖ్య సలహాదారు(Bangladesh Chief Advisor) యూనస్(Yunus)పై బంగ్లాదేశ్-స్వీడిష్ రచయిత్రి(Bangladeshi-Swedish writer) తస్లిమా నస్రిన్ (Taslima Nasrin) శుక్రవారం ఫైర్ అయ్యారు. ఆయన మత తీవ్రవాదుల(Religious Extremists)తో, వేర్పాటు శక్తుల(Forces of Division)తో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. లౌకికవాదం, ప్రజల భద్రతకు ముప్పు కలిగించే అజెండాలను ప్రోత్సహిస్తున్నాడని మండిపడ్డారు. కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్‌లో ‘బుక్ ఫర్ పీస్’ అనే అంశంపై మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కొంత మంది మత ఛాందసవాదులు, తీవ్రవాదులు తన ప్రాణాలకు ముప్పు తలపెట్టినప్పుడు, తన పుస్తకాలకు సంబంధించి ఫత్వాలు (మతపరమైన శాసనాలు) జారీ చేసినప్పుడు, అప్పటి బంగ్లాదేశ్ ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోగా తనకే అరెస్ట్ వారెంట్ జారీ చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వం అప్పట్లో మత ఛాందసవాదుల పైన, జిహాదీల పైన చర్యలు తీసుకొని ఉంటే.. బంగ్లాదేశ్ ఇప్పుడు ఇంత దారుణంగా ఉండేది కాదని తస్లిమా నస్రిన్ అభిప్రాయపడ్డారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం సొంత రాజకీయ ప్రయోజనాల కోసం, సాధ్యమైనంత ఎక్కువ కాలం అధికారంలో ఉండటానికి మతాన్ని ఉపయోగించుకుందని తప్పుపట్టారు.
Bangladesh | యూనస్‌పై తస్లిమా నస్రిన్ ఆగ్రహం
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article

