Monday, October 27, 2025
ePaper
Homeఆరోగ్యంDeaf Day |చెవుడు రాకుండా జాగ్రత్త వహించాలి!!

Deaf Day |చెవుడు రాకుండా జాగ్రత్త వహించాలి!!

ప్రతి సంవత్సరం శరదృతువు మొదటి నెల చివరి ఆదివారం, ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నేషనల్‌ డెఫ్‌ డేని జరుపు కుంటారు. చెవిటివారి దినం, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ది డెఫ్ యొక్క ఏర్పాటుకు సంబంధించి 1951 లో ఆమోదించ బడింది. చెవిటి వ్యక్తుల మానవ హక్కుల కోసం సంకేత భాష ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ఈ రోజును యూఎన్‌ జనరల్‌ అసెంబ్లీ ప్రకటించింది. బధిరుల ఎదుగుదలకు, అభివృద్ధికి సంకేత భాషలో నాణ్యమైన విద్యతోపాటు ఈ భాషకు సేవల కోసం ఈ రోజు ప్రధాన లక్ష్యంగా ఈరోజును నిర్వహిస్తున్నారు. 

ఇంటర్నేషనల్‌ డెఫ్‌ డేని మొదటిసారి 1958 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. ఇటలీలోని రోమ్‌ లో వరల్డ్ డెఫ్ డే కి 1951 లో రూపకల్పన చేశారు. ఇది అంతర్జాతీయ ప్రభుత్వేతర సెంట్రల్ ఆర్గనైజేషన్‌. వినికిడి లేనివారి జాతీయ అసోసియేషన్‌ లతో కూడి ఉన్నది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థలో 130 దేశాలు సభ్యత్వం కలిగివున్నాయి. జాతి , దేశము , మతము, లింగ వివక్ష , ఇతర ప్రాధాన్యాలు , భేదాలు లేకుండా ప్రజలందరికీ సమానత్వము , మానవ హక్కులు , గౌరవ మర్యాదలు ఒకేమాదిరి ఉండాలన్నది ఈ వరల్డ్ డెఫ్ డే సిద్ధాంతం.

గణాంకాల ప్రకారం, భూమిపై తొమ్మిది మందిలో ఒకరికి వినడానికి ఇబ్బంది ఉంది. ఈ వ్యాధి యొక్క కారణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వ్యాధి యొక్క పరిణామాలు, ప్రమాదాలు, పుట్టుకతో వచ్చే వైకల్యాలు. ప్రపంచ వ్యాప్తంగా, సుమారు 30 మిలియన్ల చెవిటి మరియు మూగ ప్రజలు ఉన్నారు. 

 2001 జనాభా లెక్కలు ప్రకారం, ఇండియాలో 2.19 కోట్ల మంది వికలాంగులు ఉన్నారు. వారు మొత్తం జనాభాలో 2.13% ఉన్నారు. వీరిలో కంటికి, వినికిడికి, మాట, లోకో మోటారు మరియు మానసిక సంబంధమైన వైకలాల్ని కలిగి ఉన్నారు. ఇండియాలో సుమారు 60 మిలియన్లు చెవిటివారు ఉన్నారు. పురుషులకు స్త్రీలకు వేర్వేలు ఆర్గనైజేషన్లు ఉన్నాయి. Delhi foundation of Deaf women , Madras foundation of Deaf Women.సెప్టెంబర్ 26 న ” డే ఆఫ్ ది డెఫ్ ” భారత దేశంలో జరుపు కుంటారు.చెవిటి వారికి ఆటలకు ఎన్నో స్పోర్ట్స్ అసోషియేషన్లు ఉన్నాయి. ” All India sports council of the Deaf ” , All India Cricket association of the Deaf” , “Delhi sports council for the Deaf” . మున్నగునవి. ఎన్నో చెవిటి , మూగ స్కూల్స్ ఉన్నాయి. మూగవారికి ప్రత్యేక సైన్‌ లాంగ్వేజ్ ఉన్నది.

చెవిటి పిల్లల కోసం సంస్థలు, సాధారణ విద్యా సంస్థలలో ప్రత్యేక సమూహాలు తెరవ బడతాయి. పిల్లలు వారి సామర్థ్యాలకు అనుగుణంగా పాఠాలను చదవడం, వ్రాయడం, వేలిముద్రల వర్ణమాలను ఉపయోగించి కమ్యూనికేట్ చేయడం మాత్రమే కాకుండా, సరైన అవగాహనతో, వారి స్వంత అభివృద్ధితో కూడా పని చేస్తారు. 

అపరిశుభ్రమైన నీళ్లలో స్విమ్మింగ్, చెవిలో పిన్నులు, పుల్లలు, ఇయర్‌బడ్స్ పెట్టి తిప్పడం, దుమ్ము ధూళి చేరడం, అకస్మాత్తుగా వినిపించే భారీ శబ్దాల వల్ల చెవి లోపలి పోర దెబ్బతినడం వంటివన్నీ వినికిడి సమస్యకు దారితీయవచ్చు. ఎక్కువ శబ్దంతో టీవీలు చూడడం, మొబైల్ ఫోన్ లో గంటల తరబడి మ్యూజిక్ వినడం, సెల్ ఫోన్ రేడియేష‌న్.. వీటి వ‌ల్ల కూడా సమస్య దరిచేరవచ్చు. ఫోన్ కాల్స్ మాట్లాడేట‌ప్పుడు ఒకే చెవివైపు మొబైల్ పెట్టి ఎక్కువ‌సేపు మాట్లాడ‌ కూడ‌దు. ఇయ‌ర్‌ఫోన్స్‌ వాడినా గంటకు మించి మాట్లాడడం పనికిరాదు. వాల్యూమ్ మితంగానే ఉండాలి.

చెవిపోటు వ‌చ్చిన‌ప్పుడు చాలా మంది సొంత వైద్యం చేస్తుంటారు. ఇది మ‌రిన్ని స‌మ‌స్యలకు దారి తీయవచ్చు. అందుకే వెంటనే ఈఎన్‌టీ డాక్టర్‌ని త‌ప్పనిస‌రిగా సంప్రదించాలి. సాధారణంగా జలుబు తర్వాత ఎక్కువగా కనిపించే సమస్య చెవి ఇన్ఫెక్షన్. ఇది ముదిరే కొద్దీ చెవిపోటు, జ్వరం, చెవి నుంచి చీము కారే సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఇంకా నిర్లక్ష్యం చేస్తే కర్ణబేరి దెబ్బతిని చెవిటి వారిగా మారే ముప్పు ఉంది. స్నానం చేసే సమయంలో నీళ్లుచెవిలోకి వెళ్ళకుండా జాగ్రత్త పడడం, సైనస్ ఉంటే వెంటనే చికిత్స తీసుకోవటం ఉత్తమం. గులిమి (వాక్స్) ని తీయక పోవడమే మంచింది. ఆకు పసర్లు, నూనెలు వంటివి చెవిలో పోయకూడదు అని గమనించాలి.

By – రామ కిష్టయ్య సంగన భట్ల.

RELATED ARTICLES
- Advertisment -

Latest News