Wednesday, February 11, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐDubai | ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు

Dubai | ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు

డిసెంబర్ 12 నుంచి 14 వరకు
వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో 100 దేశాల తెలుగు సాంకేతిక నిపుణుల ప్రమాణస్వీకారం
2026-28 WTITC నాయకత్వానికి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు

హైదరాబాద్, నవంబర్ 9 (ఆదాబ్ హైదరాబాద్): ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు 2025 డిసెంబర్ 12 నుంచి 14 వరకు దుబాయ్‌లోని ప్రతిష్టాత్మక వరల్డ్ ట్రేడ్ సెంటర్‌(World Trade Center)లో జరుగుతాయి. ఈ విషయాన్ని ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి (WTITC) ప్రకటించింది. 3 రోజులు నిర్వహించే ఈ సభలు డిసెంబర్ 12న ప్రత్యేక నెట్‌వర్కింగ్ ఈవెంట్(Special Networking Event), యాచ్ పార్టీతో ప్రారంభమవుతుంది. డిసెంబర్ 13, 14 తేదీల్లో ప్రధాన సమావేశాలు, WTITCకి కొత్తగా నాయకత్వం వహించేవారి ప్రమాణస్వీకారోత్సవం (Oath-taking Ceremony) ఉంటుంది.

- Advertisement -

రెండేళ్లకోసారి జరిగే ఈ సమావేశాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సాంకేతిక నిపుణులు, ఆవిష్కర్తలు, వ్యాపారవేత్తల అత్యంత ప్రాధాన్యమైన భేటీల్లో ఒకటిగా అవతరించింది. దీని ద్వారా 100కి పైగా దేశాల నుంచి తెలుగు సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు ఒకే వేదిక పైకి రానున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI), బ్లాక్‌చైన్, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్ డిజైన్, క్లౌడ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫిన్‌లాక్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వంటి అత్యాధునిక రంగాల్లో జరుగుతున్న పురోగతులను ప్రదర్శించనున్నారు.

ఈ ఏడాది సమావేశాల్లో పాల్గొనాలనుకునేవారు వివరాల కోసం www.wtitc.org లేదా +91 81231 23434 (ఇండియా), +971 56577 8923 (యూఏఈ)ని సంప్రదించొచ్చు. WTITC ప్రధాన కార్యాలయం (Head Office) హైదరాబాద్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 2,534 రిజిస్టర్డ్ టెక్నాలజీ కంపెనీల నెట్‌వర్క్. తదుపరి మీటింగ్ 2027లో జరుగుతుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News