ఫిర్యాదుదారు లింగాల పుష్ప తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె పేరు యమ్జల నవీనా @ సోనీ, భర్త పేరు శ్రీధర్, వయస్సు 27 సంవత్సరాలు, వృత్తి జిహెచ్ఎంసి వర్కర్.
13.01.2026 తేదీన యమ్జల నవీనా @ సోనీ తన భర్త శ్రీధర్ తో కలిసి ఫిర్యాదుదారు నివాసమైన లక్ష్మీ నరసింహ కాలనీకి వచ్చింది. 16.01.2026 తేదీన ఉదయం సుమారు 11:00 గంటలకు యమ్జల నవీనా @ సోనీ తన ఇద్దరు ఆడ పిల్లలు కుమారి తన్మయి వయస్సు 7 సంవత్సరాలు, కుమారి నిహారిక వయస్సు 4 సంవత్సరాలతో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఫిర్యాదుదారు బంధువుల ఇళ్లు, స్నేహితుల ఇళ్లు, తెలిసిన అన్ని ప్రదేశాలలో ఆచూకీ కోసం విచారణ శోధనలు నిర్వహించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లభించలేదని తెలిపారు.
ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు అందడంతో సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
