Thursday, March 26, 2026
Homeమెదక్‌Chilipched | మంజీరా నదిలో దూకిన మహిళ మృతి

Chilipched | మంజీరా నదిలో దూకిన మహిళ మృతి

మంజీరా నదిలో దూకి మహిళా ఆ*త్మహ*త్య చేసుకున్న సంఘటన సోమవారం చిలిపిచేడ్ మండల పరిధిలోని చాముండేశ్వరి సమీపంలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సిరిపురం గ్రామానికి చెందిన బండల్ల శమంత (29) గత ఏడు సంవత్సరాల కిందట వెల్దుర్తి మండలం శెట్టిపల్లి గ్రామం చెందిన కర్ణాకర్ తో ప్రేమ వివాహం చేసుకుంది. కుటుంబ తగాదాల నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా భర్తతో విడిగా తల్లి గారి ఇంటి వద్ద సిరిపురంలో ఉంటుంది.

సోమవారం మధ్యాహ్నం సమయంలో కుటుంబీకులకు ఫోన్ లో మాట్లాడుతూ నేను చాముండేశ్వరి ఆలయం వద్ద బ్రిడ్జిపై నుంచి మంజీరా నదిలో దూకి ఆ*త్మహ*త్య చేసుకుంటున్నానని చెప్పింది. మృతురాలి తమ్ముడు ఘటన స్థలానికి చేరుకుని శమంతకు సంబంధించిన ఫోను, చెప్పులు బ్రిడ్జిపై చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చిలిపిచేడ్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది సహాయంతో గాలించగా మృతదేహం లభించింది. ముత్రదేహాన్ని పోస్టుమార్టం నిమితం జోగిపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని ఎస్ఐ నర్సింలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News