Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణషాపు కూల్చివేతపై మహిళ ఆందోళన

షాపు కూల్చివేతపై మహిళ ఆందోళన

  • పెట్రోల్‌ బాటిల్‌తో రోడ్డుపై బైఠాయింపు

కల్యాణపురి వద్ద గత 20 ఏళ్లుగా ఆ మహిళ పాల కేంద్రాన్ని నడుపుతోంది. అయితే తమ షాపును జీహెచ్‌ఎంసీ అధికారులు అక్రమంగా కూల్చివేశారని ఆందోళన వ్యక్తం చేస్తోంది. పెట్రోల్‌ బాటిల్‌ పట్టుకుని జీహెచ్‌ఎంసీ వాహనాల ముందు బైఠాయించి నిరసన తెలిపింది. తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తన పాల కేంద్రాన్ని కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తోంది. మరో వైపు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ రోడ్డులో శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు కూల్చివేతలకు దిగారు. పన్ను కట్టకుండా అక్రమంగా నిర్మించిన ప్రకటనల హోర్డింగ్‌ పాయింట్స్‌. అక్రమ హోర్డింగ్‌లను అధికారులు కూల్చివేస్తున్నారు. స్థానిక మున్సిపాలిటీ అధికారుల ఫిర్యాదుతో హైడ్రా చర్యలకు దిగింది. అలాగే శంషాబాద్‌లోని సిద్ధాంతి జాతీయ రహదారి ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ పంప్‌ ప్రాంతంలోని హోర్డింగ్‌లను తొలగించడానికి హైడ్రా సిబ్బందితో సహా ఇక్కడికి వచ్చి పరిశీలన జరుపుతోంది. మరికొద్ది సేపట్లో కూల్చివేతల ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Latest News