Monday, January 19, 2026
EPAPER
HomeజాతీయంParliament | డిసెంబర్ 1 నుంచి శీతాకాల సమావేశాలు

Parliament | డిసెంబర్ 1 నుంచి శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Winter Session) డిసెంబర్ 1 నుంచి 19 వరకు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్మ (Droupadi Murmu) ఆమోద ముద్ర వేశారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (kiran rijiju) తెలిపారు. ఆదివారాలు, సెలవులు తీసేస్తే నికరంగా 15 రోజులు సమావేశాలు జరుగుతాయి. ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (SIR), ఇండియా-పాకిస్థాన్ యుద్ధం(India-Pakistan War)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) వ్యాఖ్యలు తదితర అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. గతేడాది శీతాకాల సమావేశాలు నవంబర్ 25నే ప్రారంభమై.. పాతిక రోజులు జరగ్గా ఈసారి ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా ఆరంభిస్తున్నారని, సమావేశాలు జరగాల్సిన రోజుల సంఖ్యను కావాలనే తగ్గించారని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News