Thursday, February 12, 2026
Homeఆరోగ్యంEgg | ఏ గుడ్డు మంచిది?

Egg | ఏ గుడ్డు మంచిది?

ఎగ్స్ తింటే ఆరోగ్యానికి (Health) మంచిది. అయితే.. ఉడకబెట్టిన (Boiled) గుడ్డు తింటే బెటరా(Better)? లేక, పచ్చి గుడ్డు (Raw Egg) తినాలా? అని డౌటు (Doubt) రావొచ్చు. దీనికి సమాధానం.. ఉడకబెట్టిన గుడ్డు తినటమే ఆరోగ్యానికి ఉత్తమం. ఒక వేళ పచ్చి గుడ్డు తింటే.. ఆ సమయంలో.. అందులో బ్యాక్టీరియా (Bacteria) ఉంటే.. ఇన్‌ఫెక్షన్ (Infection) వస్తుంది. కడుపులో నొప్పి, విరేచనాలు(Motions), జ్వరం (Fever) కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి గుడ్లను బాగా బాయిల్ చేసి, అట్టు మాదిరిగా వేసుకొని తింటే ఇంకా మంచిది. గుడ్డు ద్వారా చాలా పోషకాలు (Nutrients) లభిస్తాయి. ప్రొటీన్, కొవ్వు, విటమిన్లు, కొలీన్, ల్యూటీన్ వంటివి మన శరీరానికి అందుతాయి. గుడ్డులోని కొవ్వు ముఖ్యంగా పసుపు పచ్చ సొనలో ఉంటుంది. కాబట్టి చాలా మంది అది తినరు. తెల్ల సొన మాత్రమే తిని మిగతాది వదిలేస్తారు. గుడ్డులోని కొవ్వు ఎక్కువ శాతం ‘అసంతృప్తి’ (అన్‌శాచురేటెడ్) రకానికి చెందిందే. అందువల్ల ఈ కొవ్వు ఆరోగ్యానికి హాని చేయదు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News