ప్రజాభిప్రాయం లేకుండానే శివారు మునిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడమేంటి?
చక్రిపురం డివిజన్‌పై ముదురుతున్న వివాదం
కుషాయిగూడ డివిజన్ కావాలని కొందరు..
చక్రిపురం డివిజన్ ఉండాలని మరికొందరు..
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(GHMC)లో ఇప్పటివరకూ ఉన్న 150 డివిజన్లు (Divisions) ఇప్పుడు 300 అయ్యాయి. శివారు మునిసిపాలిటీలను (Municipalities) గ్రేటర్‌లో కలపడంతో మొత్త డివిజన్ల సంఖ్య 300కి పెరిగింది. అయితే.. కాప్రా సర్కిల్ పరిధిలో చక్రిపురం ఏఎస్ రావు నగర్‌లోని మరో డివిజన్ కొత్తగా రెండు డివిజన్లో కావడంతో వివాదం చినరేగింది చర్లపల్లి డివిజన్లోని మరో చక్రిపురం డివిజన్ ను ప్రతిపాదనలు వచ్చాయి ఆలు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా చక్రిపురం డివిజన్ (Chakripuram Division) నమూనా సోషల్ మీడియాలో వైరల్ అయింది డివిజన్ కాకముందే కుషాయిగూడ డివిజన్(Kushaiguda Division)ను చేయాలని లేదు. కుషాయిగూడనే డివిజన్ చేయాలని మరికొందరు ఆందోళనకు దిగుతున్నారు.
ఇప్పటికి గ్రేట్ హైదరాబాద్‌పై చక్రిపురంపై డివిజన్ అని అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు చక్రిపురంలో చుట్టుపక్కల 25 నుండి 36 కాలనీలో ఉన్నాయి కుషాయిగూడ ప్రధానమైనప్పటికీ కుషాయిగూడ డివిజన్‌ని చేయాలని కుషాయిగూడ వాస్తవులు పట్టుబడుతున్నారు కుషాయిగూడ వద్దు చక్రిపురమే ముద్దని చక్రపురం వాస్తవ్యులు పట్టుబడుతున్నారు ఇరువురు ఆందోళనకు దిగుతున్నారు డివిజన్‌లో పునర్విభజన భాగంలో కాపు సర్కిల్లో రెండు డివిజన్లు పెరిగాయి. జిహెచ్ఎంసి వ్యాప్తంగా మరో 150 డివిజన్లు పెరిగాయి. గతంలో కంటే ఇప్పుడు జిహెచ్ఎంసికి భారమే అన్నట్లు జనాభా కూడా తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద నగరముగా ఆవిర్భవించబోతుంది.
గ్రేటర్ హైదరాబాద్‌ని గోల్కొండ (Golconda) సికింద్రాబాద్ (Secunderabad) గోల్కొండ రెండు గ్రేటర్లుగా గత కేసిఆర్ ప్రభుత్వంలోనే తీర్చిదిద్దుదామని అనుకున్నారు కానీ నిధులు లేక రెండు గ్రేటర్లు కాలేకపోయింది గతంలో గ్రేటర్ హైదరాబాద్ నగర చుట్టుపక్కల ఉన్న శివారు మున్సిపాలిటీలు శివారు గ్రామ పంచాయతీలు గతంలో విలీనం చేస్తే ప్రజలు అడ్డుకున్నారు నిరసనలు వ్యక్తం చేశారు కొంత మేరకు ప్రజా ఆందోళనకు చూసి భయపడ్డా గత కేసిఆర్ ప్రభుత్వం జోహార్ నగర్ మున్సిపాలిటీ దమ్మైగూడ నాగారం తదితర గ్రామ పంచాయతీలు తదితర మున్సి పాలిటీలను గ్రేటర్లో విలీనం చేయకుండా నిలిపివేసింది.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరణ లేకుండానే రాత్రికి రాత్రి జీవో తీసుకువచ్చి చుట్టుపక్కల ఉన్న శివారు మున్సిపాలిటీలను శివారు గ్రామ పంచాయతీలను గ్రేటర్లో కలుపుతూ 300 వార్డులుగా చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు దీనితో ఆయా రాజకీయ పార్టీలు పార్టీలలో ఉద్యమాలకు ఆద్యం పోసినట్టు అయింది ప్రస్తుతం బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఊపందుకున్నాయి .గ్రామంలో ఉండే ప్రజలు నగర మధ్యల ఉండే ప్రజలకు పోటీగా పన్నులు ఎలా కడతారని బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా గ్రేటర్‌లో విలీనాన్ని నిలిపివేయాలని బిజెపి శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి పట్టుబడుతున్నారు. గ్రేటర్‌లో 150 డివిజన్లలో అభివృద్ధి పడకేసిందని, చిరుజల్లుల వర్షాలకు గాలులకు తుమారాలకు అస్తవ్యస్తంగా అవుతుంది. చినుకు పడితే గ్రేటర్ హైదరాబాద్ అంతా సాగరహారాలే. ఎక్కడ చూసినా మురికి నీరు వర్షపు నీరు దర్శనమిస్తుంది. డ్రైనేజ్ వ్యవస్థను మరింత మెరుగుపరచాలన్న కురిసిన వర్షాలు నీరు యధావిధిగా 17000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని గత ప్రభుత్వంలో కేసీఆర్ అంచనా వేశారు. ఇప్పటికైనా గ్రేటర్లో శివారు మున్సిపాలిటీలను విలినా అని పునరాలోచన చేయాలని వామపక్ష పార్టీలు బీజేపీ ప్రభుత్వానికి సూచిస్తున్నారు..
300 డివిజన్లు విలీనం అయిన తర్వాత ప్రజాభిప్రాయం ప్రస్తుతం పెట్టడం అంతర్యం ఏమిటని రాజకీయ పార్టీల నేతలు బహటం గానే విమర్శలు గుప్పిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్లో గ్రామాలను మున్సిపాలిటీలను విలీనం చేయడం అంటే పల్లెలను లేకుండా చేయడమే ఇది కుట్రన హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ కిలోమీటర్ల పైనే వస్తుంది గ్రామాలను పరిం “క్షించాల్సింది పోయి దేశ అభివృద్ధికి పల్లెలు లాంటివి అలాంటి పల్లెలను నగరికరణ పేరుతో చెరిపేస్తున్నారు గ్రేటర్లో మున్సి పాలిటీల విలీనాని తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా పునరాలోచిస్తుందో విలినాన్ని 150 డివిజన్లను విలీనం చేస్తారా లేనిచో అలానే ఉంచుతారా గ్రేటర్ ఉంచినట్లయితే భారీగా ఖర్చు అవుతుంది అని పలువురు రాజకీయ నేతలు వాక్యాన్ని ఇస్తున్నారు. ఏదేమి అయినప్పటికీ మరో 20 రోజుల్లో విలీనంపై ప్రభుత్వం నుండి స్పష్టత వస్తుందని వేచి చూస్తున్నారు.
