Friday, September 12, 2025
ePaper
spot_img
Homeస్పోర్ట్స్పాక్‌పై విండీస్‌ సంచలన విజయం

పాక్‌పై విండీస్‌ సంచలన విజయం

  • రెండో టెస్టులో 120 పరుగుల తేడాతో విజయం
  • 35ఏళ్లలో తొలిసారి పాక్‌ గడ్డపై టెస్టు విజయం

పాకిస్థాన్‌ గడ్డపై వెస్టిండీస్‌ చారిత్రక విజయం సాధించింది. దాదాపు 35ఏళ్ల తర్వాత పాక్‌ను వారి స్వదేశంలో టెస్టు మ్యాచ్‌లో ఓడించింది. ముల్తాన్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్‌ 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో విండీస్‌ గత 35ఏళ్లలో తొలిసారి పాక్‌ గడ్డపై టెస్టు విజయం రుచి చూసింది. దీనికంటే ముందు వెస్టిండీస్‌ 1990 నవంబర్‌లో ఫైసలాబాద్‌లో జరిగిన టెస్టులో పాకిస్థాన్‌పై నెగ్గింది. తర్వాత 1997, 2006లో పాక్‌ పర్యటనకు వెళ్లినా ఒక్క విజయం సాధించక్నుండానే సిరీస్‌ ముగించింది. మళ్లీ ఇన్నాళ్లకు పాక్‌ గడ్డపై గెలిచి సంచలనం సృష్టించింది. 254 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్‌ 76/4తో మూడో రోజైన సోమవారం ఆట ప్రారంభించింది. ఈ ఇన్నింగ్స్‌లో పాక్‌ 133 పరుగులకే ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌కు కేవలం 57 పరుగులే ఓడించి, చివరి 6 వికెట్లు కోల్పోయింది. బాబర్‌ అజామ్‌ (31 పరుగులు) టాప్‌ స్కోరర్‌. మహ్మద్‌ రిజ్వాన్‌ (25 పరుగులు), కమ్రాన్‌ గులాం (19 పరుగులు), సౌద్‌ షకీల్‌ (13 పరుగులు), సల్మాన్‌ ఆఘా (15 పరుగులు) పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో జోమెల్‌ వారికన్‌ 5, కెవిన్‌ సింక్లైర్‌ 3, గుడాకేష్‌ మోటీ 2 వికెట్లు దక్కించుకున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News