స్విట్జర్లాండ్‌లోని దావోస్(Davos in Switzerland)లో ఈ నెల 19 నుంచి 23 వరకు నిర్వహించే వరల్డ్ ఎకనమిక్ ఫోరం(World Economic Forum-WEF) 56వ వార్షిక సదస్సు(Annual Conference)కు రికార్డు స్థాయిలో ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సుమారు 130 దేశాల నుంచి 3 వేల మంది ప్రతినిధులు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వచ్చే అవకాశముంది. ఇందులో సుమారు 60 దేశాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రతినిధులు ఉంటారు. ప్రపంచ ఆర్థిక సదస్సుకు మన దేశం నుంచి 7 రాష్ట్రాల సీఎంలు వెళ్లనున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి చంద్రబాబు(Chandrababu-AP CM), రేవంత్ రెడ్డి(Revanth Reddy-Telangana CM) ఇప్పటికే బయలుదేరి వెళ్లారు. ‘ఎ స్పిరిట్ ఆఫ్ డైలాగ్’(A Spirit of Dialogue) అనేది ఈ ఏడాది సదస్సు థీమ్(Theme). ఈ సదస్సులో భాగంగా 2003 నుంచి ఏటా నిర్వహిస్తున్న ఓపెన్ ఫోరం ఒక ప్రత్యేక కార్యక్రమం అని చెప్పొచ్చు. ఈ సదస్సును కవర్ చేసేందుకు 400 మందికి పైగా జర్నలిస్టులు, మీడియా ప్రతినిధులు వెళుతుండటం విశేషం.
