తెలంగాణలో మత్స్యకారుల సంక్షేమాన్ని, జీవనోపాధిని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పశు సంవర్ధక & మత్స్య శాఖ మంత్రి (Animal Husbandry & Fisheries Minister) వాకిటి శ్రీహరి చెప్పారు. మహబూబ్‌నగర్‌లోని హన్వాడ హేమ సముద్రం సరస్సు వద్ద చేప పిల్లల నిల్వ కార్యక్రమాన్ని (fish seed stocking program) ఆయన ప్రారంభించారు. కలెక్టర్ విజయేంద్ర బోయి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 33 జిల్లాల్లో కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల(cold storage unit)కు డీపీఆర్‌లు(DPRs) జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో 1.8 లక్షల చేప పిల్లలను నీటిలోకి విడుదల చేశారు.
5 లక్షల మత్స్యకార కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చేలా ఉచితంగా చేప పిల్లల, రొయ్య విత్తనాల పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రూ.123 కోట్ల అదనపు బడ్జెట్‌ను మంజూరుచేశారని, ఇది మత్స్యకార అభివృద్ధికి, సంక్షేమానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. తెలంగాణ అంతటా రూ.94 కోట్ల విలువైన 84 కోట్ల చేప పిల్లలను 26 వేల ట్యాంకుల్లో, రూ.29 కోట్ల విలువైన 10 కోట్ల రొయ్యలను 300 నీటి వనరుల్లో విడుదల చేస్తున్నారమని తెలిపారు. ఇది గోదావరి(Godavari), కృష్ణా (Krishna) నదీ పరీవాహక ప్రాంతాల మధ్య అపూర్వమైన కార్యక్రమమని వివరించారు.
