Tuesday, March 3, 2026
Homeవరంగల్‌Panchayat Scam | భళా పంచాయతీరాజ్ శాఖ… భళా

Panchayat Scam | భళా పంచాయతీరాజ్ శాఖ… భళా

  • 2022లో పోయని సిసి రోడ్డుకు 2.17 లక్షల బిల్లులు మింగేశారు..
  • ఆర్టిఐ, విజిలెన్స్ విచారణతో 2026 ఫిబ్రవరిలో రోడ్డు పోశారు…
  • ఆర్టిఐ దరఖాస్తుదారునికి నయాన భయాన చెప్పి 50,000 ఫోన్ పే చేసిన పంచాయతీరాజ్ డిఈ…
  • రిటర్న్ కొట్టిన ఆర్టిఐ దరఖాస్తుదారు…
  • వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో అవినీతి ఘటన

వడ్డించేవాడు మనవాడైతే ఏ మూలన కూర్చున్న తునకలు మన కంచంలోనే అన్న చందంగా పంచాయతీరాజ్ శాఖ ఒక తప్పు చేసి తప్పుల మీద తప్పులు చేస్తూ వస్తూనే ఉంది. కొన్నిచోట్ల చేసిన పనులకు బిల్లు రాక సర్పంచులు కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణంలో అసలు ఎలాంటి రోడ్డు నిర్మించకుండానే ప్రభుత్వ సొమ్ము వాళ్ల తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి లాగా అప్పనంగా రెండు లక్షల 17 వేల రూపాయలు 2022లో నొక్కేశారు.

పంచాయతీ రాజ్ శాఖ అధికారులే నొక్కేశారా లేదా బినామీల పేరుతో బిల్లులు డ్రా చేశారా అన్నది ఒక ఎత్తు అయితే 2022 నుండి సంఘటనను మర్చిపోయిన అధికారులు ఆర్టిఐ ద్వారా వెలుగులోకి రావడంతో 2022లో చేసిన తప్పుతో పాటు మరిన్ని తప్పులు చేస్తూ ఇప్పటివరకు పబ్బం గడుపుతున్నారు.

- Advertisement -

ఆర్టిఐ దరఖాస్తుదారునికి బెదిరింపులు ఫోన్ పే లో 50,000 పంపిన అధికారులు

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని తిమ్మరాయనిపాడు గ్రామంలో 2022లో 70 మీటర్ల పొడవు గల సిసి రోడ్డు నిర్మించామని అధికారులు 217,000 బిల్లులు చేసి ప్రభుత్వ సొమ్మును కాజేశారు. ఈ విషయంపై ఇదే గ్రామానికి చెందిన కొండవీటి స్టెల్లా ప్రస్తుతం కాజీపేట లో నివాసం ఉంటున్న క్రమంలో సమాచారం తెలుసు కొని సమాచార హక్కు ద్వారా 2500 పేజీల 2019 నుంచి 2024 వరకు జరిగిన గ్రామపంచాయతీ లావాదేవీల మొత్తాన్ని అర్జీ ద్వారా పొందారు.

దీంతో సీసీ రోడ్డు వేయకుండానే బిల్లు డ్రా చేసిన విషయంపై డి ఆర్ డి ఓ కు, కలెక్టర్కు విజిలెన్స్ అధికారులకు కేంద్ర ఉపాధి హామీ పథక బాధ్యులకు విచారణ జరపాల్సిందిగా దరఖాస్తులు పెట్టారు. దీంతో గత్యంతరం లేక డి ఈ తో పాటు ఏఈ మరి కొంతమంది ఫిబ్రవరి 15వ తేదీన మీకు మేము దూరపు బంధువులు అంటూ కాజీపేట గ్రామానికి వెళ్లి నయాన భయానాలు మాట్లాడి విచారణ కేసు వాపస్ తీసుకుంటున్నట్లు స్టెల్లా కుమారుడైన సిరల్ తో సంతకం చేయించుకుని 50,000 ఇతరుల ద్వారా ఫోన్ పే చేయించారు. ఫోన్ చూసుకున్నాక 50 వేలు పాపపు సొమ్ము మాకు ఎందుకని అదే రిటర్న్ కొట్టి అదే రోజు కాజీపేట పోలీస్ స్టేషన్లో పంచాయతీరాజ్ డిఇ తో పాటు ఇంటికి వచ్చిన వారిపై దరఖాస్తు చేశారు.

ఫిబ్రవరి 4న అర్ధరాత్రి రోడ్డు పోసినవైనo

కలెక్టర్ తో పాటు డిపిఓ విజిలెన్స్ అధికారులు చేస్తున్న ఒత్తిడితో ఫిబ్రవరి 4వ తేదీన 2022 పోయాల్సిన సిసి రోడ్డును 2026 లో అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా పోసేశారు. తెల్లారి లేచి చూసేసరికి సీసీ రోడ్డు దర్శనం అవడంతో తిమ్మరహన్ పాడు గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనైనట్లు ఆర్టిఏ దరఖాస్తులు వివరించారు.

అదే రోజున గ్రామపంచాయతీ కార్యదర్శి ఫోన్ చేసి ఎంపీడీవో కు దరఖాస్తు చేసి ఈ రోడ్డు ఎవరు పోశారు ఎందుకు పోశారు నిధులు ఎక్కడివి అని ఆరాధిస్తే మాకు సంబంధం లేని రోడ్డు అని ఎవరు పోశారో మాకు తెలవదని చెన్నారావుపేట మండల ఎంపీడీవో తో పాటు పంచాయతీ కార్యదర్శి వివరణ ఇచ్చారని ఆర్టిఐ దరఖాస్తురాలు స్టెల్లా జరుగుతున్న అన్యాయాన్ని వివరించింది.

ఈ విషయంపై పంచాయతీరాజ్ డి అజయ్ ని వివరణ కోరగా పని ఒత్తిడి వల్ల 2022లో పనులు చేయలేదని ఇటీవల చేయించామని చెప్పడం కోసం మెరుపు. అధికారులు చేసిన అక్రమ రోడ్డు బిల్లు బాగోతంపై ఆర్టిఐ దరఖాస్తులు ఎంతో ధైర్యసహసాలతో అక్రమాన్ని బహిర్గతం చేశారని అలా జరగని ఎడల రెండు లక్షల 17 వేల రూపాయలు ప్రజల సొమ్ము అధికారులకు ప్రజాప్రతినిధుల జేబుల్లోకి వెళ్లేదని పలువురు స్టెల్లాను అభినందించారు.

ఈ విషయంపై ఫిబ్రవరి 27వ తేదీన రాష్ట్రస్థాయి విజిలెన్స్ కమిటీ విచారణ చేసి ఫోటోలతో పాటు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించిందని ఇందులో ఎవరెవరు అక్రమాలకు పాల్పడింది త్వరలో బహిర్గతం కానుందని గ్రామస్తులతో పాటు ఆర్టిఐ దరఖాస్తురాలు వివరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News