Wednesday, March 4, 2026
Homeవరంగల్‌MP Kavya | కేంద్ర ప్రభుత్వం.. నిర్లక్ష్యం..

MP Kavya | కేంద్ర ప్రభుత్వం.. నిర్లక్ష్యం..

వరంగల్ జిల్లా(Warangal District)లోని భారీ ఇనుప ఖనిజం నిల్వల(Iron Ore Reserves)ను గుర్తించే విషయంలో కేంద్ర ప్రభుత్వం (Union Government) నిర్లక్ష్యం(Neglect)గా వ్యవహరిస్తోందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య (MP Dr.Kadiyam Kavya) అన్నారు. ఈ మేరకు లోక్‌సభ(Lok Sabha)లో ప్రశ్నించారు. జిల్లాలోని ఖనిజ సంపదపై స్పష్టత ఇవ్వాలని కోరారు. గనుల అభివృద్ధి, పర్యావరణ అనుమతులు, స్థానిక సంస్థలకు ఆదాయ భాగస్వామ్యం, గనుల భద్రతా తనిఖీలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిలదీశారు. జిల్లాలో సుమారు 40 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో అంగీకరించినప్పటికి అభివృద్ధి విషయంలో ఎందుకు ముందుకు సాగడం లేదని అడిగారు.

కావ్య ప్రశ్నకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి (Kishan Reddy) సమాధానం చెబుతూ భారతీయ గనుల బ్యూరో నిర్వహించే జాతీయ ఖనిజ జాబితా (National Mineral Inventory) ప్రకారం.. 2025 ఏప్రిల్ 1 నాటికి ఈ ఇనుప ఖనిజం నిల్వలు ‘రిమైనింగ్ రిసోర్సెస్’ (Remaining Resources) కేటగిరీలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు వరంగల్ జిల్లాలో ఒక్క ప్రధాన ఖనిజ గని లీజు కూడా మంజూరు కాలేదని చెప్పారు. దీన్నిబట్టి చూస్తే.. ఒక్క ఖనిజం బ్లాక్ కూడా వేలం వేయలేదనేది స్పష్టమవుతోందని పేర్కొన్నారు.

- Advertisement -

జిల్లాలో అపార ఖనిజ సంపద ఉన్నప్పటికీ ఉపాధి అవకాశాలు, స్థానిక అభివృద్ధి, గ్రామ పంచాయతీలకు ఆదాయం వంటి ప్రయోజనాలు ప్రజలకు దక్కని పరిస్థితి కొనసాగుతోందని ఎంపీ విమర్శించారు. కేంద్రం గనుల అభివృద్ధిపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని, తెలంగాణ ప్రాంతాల పట్ల వివక్ష చూపుతోందని మండిపడ్డారు. వరంగల్ వంటి వెనకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని, ఖనిజ సంపదను ప్రజల సంక్షేమానికి ఉపయోగించే దిశగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News