Sunday, March 29, 2026
Homeక్రైమ్ వార్తలుAdditional Collector Arrest | సంబరాలు చేసుకున్న రైతులు

Additional Collector Arrest | సంబరాలు చేసుకున్న రైతులు

వరంగల్ (Warangal) అడిషనల్ కలెక్టర్ ఎ.వెంకట్‌ రెడ్డిని ఏసీబీ (ACB) నిన్న శుక్రవారం అరెస్ట్ చేసిన నేపథ్యంలో రైతులు ఇవాళ శనివారం సంబరాలు (Celebrations) చేసుకున్నారు. బాణాసంచా కాల్చి (burst firecrackers) వెంకట్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు (Slogans) చేశారు. తమను ఇబ్బందిపెట్టిన అధికారికి తగిన శాస్తి జరిగిందంటూ హర్షం (Happy) వెలిబుచ్చారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే(Greenfield Highway)కి భూములు ఇచ్చిన రైతులు వెంకట్ రెడ్డి అరెస్ట్‌ను ఆనందంగా జరుపుకున్నారు. భూములు కోల్పోయిన తమకు న్యాయమైన పరిహారం రాకుండా చేశాడని ఆరోపించారు.

వేడుకల సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. హైవే ప్రాజెక్ట్ కోసం తీసుకున్న భూమికి పరిహారం నిధులను సక్రమంగా చెల్లించకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నాడని మండిపడ్డారు. ఆయన వల్ల తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, పూడ్చలేని నష్టాన్ని కలిగిందని బాధిత రైతులు వాపోయారు. ఆ అధికారిని ACB అరెస్టు చేయడం సరైన పరిణామమని, తమకు సంతృప్తిని కలిగించిందని చెప్పారు. అయితే వెంకట్ రెడ్డి ఈ వ్యవహారంలో అరెస్ట్ కాలేదు. ప్రైవేట్ పాఠశాల అనుమతుల పునరుద్ధరణకు డబ్బు డిమాండ్ చేసి రూ.60 వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News