రోజులు మారిన కొద్ది, రాజ్యాలు మారుతున్నాయా? రాజులు మారుతున్నకొద్ది రాజ్యాలు మారుతున్నాయా? పూర్వం వ్యవసాయము తెలియని రోజుల్లో పొట్ట చేత పట్టు కొని ఎక్కడైతే ఆకలి దప్పికలకు కొదవలేనట్టి ప్రదేశమును ఎంచుకొని నివాసాలను ఏర్పరచుకున్నట్లు.. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని.. కూటికి వలస పోయినట్లుంది నేటి పరిస్థితి.. మన బ్రతుకులు బాగుపడతాయేమో అని ఆశతో.. గంటలు గంటలు వేచి వేచి బేజారైనా ఓపికగా ఓటు వేస్తే.. ఓటరు తాను రాసిన గీతతో వారి పుట్టగతులు మారిపోతున్నాయి. ఇది ప్రజా నాయకుడి తప్పా? లేక ప్రజల తప్పా?ఖచ్చితంగా మన తప్పే.. ఎందుకంటే ఆలోచించకుండా ఓట్లు వేసింది మనమే కదా..?
- ఆదాబ్ హైదరాబాద్
- Advertisement -
