- క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ..
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీపై సోషల్ మీడియా వెరైటీ రూమర్స్ నడుస్తున్నాయి. ఆర్సీబీ జట్టులో అయిదుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారని, దాంట్లో విరాట్ కోహ్లీ కూడా ఒకరని ఆన్లైన్లో ట్రోల్స్ జరుగుతున్నాయి. చాన్నాళ్ల నుంచి విరాట్ లండన్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో అతనిపై ఆ పుకార్లు పుట్టాయి. అయితే ఆర్సీబీ క్రికెటర్ విరాట్ కోహ్లీ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న జోక్స్ అతను చెక్ పెట్టేశాడు. తానేమీ ఓవర్సీప్ ప్లేయర్ కాదన్నారు.
ఆర్సీబీ హోస్ట్ దనిష్ సైత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఈ విషయాన్ని చెప్పాడు. ఆర్సీబీ జట్టులో అయిదుగురు విదేశీ క్రికెటర్లు ఉన్నారని విమర్శలు వస్తున్నట్లు హోస్ట్ అడిగిన ప్రశ్నకు కోహ్లీ సమాధానం ఇచ్చాడు. ఆ ప్రశ్నకు కోహ్లీ నవ్వుతూ.. నాకు తెలియదు, నన్ను ఎందుకు అడుగుతున్నారు, విదేశీ ఆటగాళ్లను అడగండి, నేనేమీ విదేశీ ప్లేయర్‌ను కాదు, నేనేమైనా ఓవర్సీస్ ప్లేయర్‌నా అని కోహ్లీ ఎదురు ప్రశ్న వేశారు.
