Wednesday, March 4, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | పల్లెల్లో ఎన్నికల పండుగ వచ్చింది..

Aaj Ki Baath | పల్లెల్లో ఎన్నికల పండుగ వచ్చింది..

పల్లెల్లో ఎన్నికల పండుగ వచ్చింది.. తల్లి లాంటి పల్లె నేడు ఎన్నికల వేడిలో తల్లడిల్లుతోంది. ఉపాధి లేక వలస వెళ్లుడు ఆగాలంటే!. ప్రతి పల్లె ఉత్పత్తి, ఉపాధికి కేంద్రంగా అభివృద్ధి చేసుకోవాలి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయితీ నిధులను సకాలంలో పంపాలి. గ్రామస్తుల సమిష్టి కృషితో “నేనుసైతం”అంటూ యువత రాజకీయాల్లోకి రావాలి. ప్రభుత్వ పథకాల ఫలాలు సక్రమంగా, సమంగా ప్రతి కుటుంబానికి చేరేలా చూసే బాధ్యత ప్రథమ పౌరులైన సర్పంచులదే.. పల్లెలే ఈ దేశానికి, ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు. ఈ ఎన్నికల్లో ఓట్ల కోసం మద్యం, డబ్బు పంచవద్దు. అప్పులపాలు కావద్దు. ఓటర్లు ప్రలోభాలకులొంగొద్దు.. గ్రామ రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితం కావాలి. కక్షలూ, కార్పణ్యాలు మానుకొని గ్రామ అభివృద్ధిలో సమిష్టిగా పాల్గొనాలి. ఓటరు మహాశయా!మీ నిర్ణయమే రేపటి ఐదేళ్ల మీ (గ్రామ) భవిత.

  • మేదాజీ

- Advertisement -
RELATED ARTICLES

Latest News