Homeవరంగల్‌Campaign | రాష్ట్ర ప్రభుత్వం అండతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం...

Campaign | రాష్ట్ర ప్రభుత్వం అండతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం…

  • మహిళా, రైతు, పేద వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..
  • నీతి నిజాయితీగా పని చేసే వారినే ఎన్నుకోవాలి…
  • ఆలోచించకుండా ఓటు వేస్తే 5ఏళ్ళు అవస్థలు పడాలి…
  • కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మహేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి…
  • వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని అన్నారం షరీఫ్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గాడిపెళ్లి మహేందర్ కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతకు ముందు గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావ, మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం నుండి షరీఫ్ దర్గా వరకు డప్పు చప్పులతో, మహిళా కోలాటం వారిచే నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు.

KR Nagaraju Campaign for Village Development in Annaram Sharif 01

అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద గ్రామస్తులను ఉద్దేశించి ఈ సందర్బంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందాలన్నా, గ్రామ సమస్యలు పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను మాత్రమే గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఇంకా 3ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని, ఎమ్మెల్యే గా నేను ఉంటానని గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. ఇతర పార్టీ అభ్యర్థులు గెలిస్తే, ప్రభుత్వం దగ్గరకు, ఎమ్మెల్యే దగ్గరకు రాలేడని, గ్రామంలో ఏ రకమైన అభివృద్ధి పనులు చేసేందుకు అవకాశం ఉండదని కావున గ్రామ ప్రజలు గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గాడిపెళ్లి మహేందర్ కత్తెర గుర్తుపై ఓటు వేయాలని కోరారు.

- Advertisement -
KR Nagaraju Campaign for Village Development in Annaram Sharif 2

ఇతర పార్టీల అభ్యర్థులు ఇచ్చే మద్యం, డబ్బులకు ఆశ పడి, వాళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మి వారికీ ఓటు వేస్తే గ్రామంలో జరగాల్సిన అభివృద్ధి ఆగిపోతుందని తెలిపారు. ఈ ఎన్నికలు గ్రామ అభివృద్ధికి సంబందించిన ఎన్నికలని మన గ్రామ అభివృద్ధి మన చేతుల్లోనే ఉందని కావున పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి గాడిపెళ్లి మహేందర్, వార్డు అభ్యర్థులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

KR Nagaraju Campaign for Village Development in Annaram Sharif 3
- Advertisement -
RELATED ARTICLES

Latest News