జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (JubileeHills By-Election) ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి.హనుమంతరావు (VH) పాల్గొన్నారు. పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) తరఫున ప్రచారం చేశారు. నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ సైట్-3, బాబా శైలని నగర్‌లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఇంటింటి ప్రచారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వీహెచ్‌తోపాటు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(Palakurthy MLA Yashaswini Reddy), జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ పాల్గొన్నారు.

ఇంటింటికీ (Door to Door) చేరుకొని ప్రజలతో ఆత్మీయంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు(Schemes), మహిళా సంక్షేమ పథకాలు, ఉచిత విద్యుత్, యువతకు ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను వివరించారు. ప్రజల ఆశీర్వాదంతో ఈసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో గెలిపించి, అభివృద్ధి, సేవలను కొనసాగించేందుకు అందరూ కలిసి కృషి చేయాలని కోరారు. ఇంటింటి ప్రచారంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, యువత భారీగా పాల్గొన్నారు.






