- ఉచిత శిభిరం ఆర్గనైజర్ వెంకట్
- అజ్జమర్రిలో మల్లారెడ్డి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు
గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఉచిత వైద్య శిబిరం ఆర్గనైజర్ వెంకట్ చెప్పారు.బుధవారం చిలిపిచేడ్ మండలంలోని అజ్జమర్రి గ్రామంలో సూరారం మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆర్గనైజర్ వెంకట్ మాట్లాడుతూ…అన్ని రకాల వ్యాధుల నివారణకు ప్రత్యేక వైద్య బృందం గ్రామానికి వచ్చి ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తే ప్రజలందరు చికిత్సలు చేయించుకోవాలన్నారు.
వైద్యుల సూచనలు తప్పకుండ పాటించి మందులు వాడితే వ్యాది నయం అవుతుందని ఆయన చెప్పారు.ఈ శిబిరంలో 100మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు.ఈ కార్యక్రమంలో డాక్టర్లు విరాట్,శ్రీనాథ్,అమీక్ష,పార్మాసిస్టు దాసు,ఆసుపత్రి సిబ్బంది,గ్రామస్తులు,రోగులు పాల్గొన్నారు.
