నోబెల్ ప్రైజ్(Nobel Prize) కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన అమెరికా అధ్యక్షుడు(America President) ఎట్టకేలకు ఆ బహుమతిని పొందారు. కాకపోతే ఆ ప్రైజ్‌ను నోబెల్ కమిటీ అతనికి ఇవ్వలేదు. నోబెల్ శాంతి బహుమతి(Nobel Peace Prize)ని పొందిన వెనెజువెలా ప్రతిపక్ష నేత(Venezuelan Opposition Leader) మరియా కొరీనా మచాడో(Maria Corina Machado) అందజేశారు. ట్రంప్ కూడా ఆ అవార్డును స్వీకరించారు. ఆ మెడల్‌ను ట్రంప్ తన వద్దే ఉంచుకోబోతున్నారని శ్వేతసౌధం అధికారి(WhiteHouse Officer) చెప్పినట్లు ఇంగ్లిష్ మీడియా వెల్లడించింది. కానీ.. ఈ ఘటనపై స్పందించిన నోబెల్ ఇన్‌స్టిట్యూట్ ఈ ప్రైజ్‌ను ఇలా వేరేవాళ్లకు ఇవ్వటం లేదా వారేవాళ్లతో కలిసి పంచుకోవటం లేదా రద్దు చేయటం కుదరదని స్పష్టం చేసింది. ఎవరికి ప్రకటిస్తే వాళ్లే తమ వద్ద ఉంచుకోవాలని పేర్కొంది. నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ మరియా కొరీనా మచాడో మాత్రం నోబెల్ ఇన్‌స్టిట్యూట్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఈ ఎపిసోడ్ భవిష్యత్‌లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
Nobel Prize | ఎట్టకేలకు ట్రంప్‌కు నోబెల్ ప్రైజ్!
- Advertisement -
RELATED ARTICLES
