భారతీయ జనతా పార్టీ(BJP)కి ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్(Working President)గా నితిన్ నబీన్(Nitin Nabin) నియమితులైన సంగతి తెలిసిందే. అయితే.. ఆ నియామకాన్ని అధికారికంగా ధ్రువీకరించేందుకు లాంఛనంగా ఎన్నిక(Election) నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్(Schedule)ను ఈ రోజు ప్రకటించారు. పార్టీ రిటర్నింగ్ ఆఫీసర్(Party Returning Officer) కె.లక్ష్మణ్ వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ రోజే సాయంత్రం 5 గంటల నుంచి 6 వరకు నామినేషన్లను విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకరికి మించి అభ్యర్థులు పోటీలో ఉంటే తర్వాతి రోజు (ఈ నెల 20న) పోలింగ్ చేపడతారు. ఈ వ్యవహారం మొత్తం బీజేపీ కేంద్ర కార్యాలయంలోనే జరుగుతుంది. అదే రోజు కొత్త అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారు. అయితే నితిన్ నబీన్‌నే నూతన అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది.
