రవాణా శాఖ(Transport Department)లో నేటి (శనివారం) నుంచి మరిన్ని సంస్కరణలు (Reforms) అమలవుతున్నాయి. షో రూంల(Dealers) వద్దే వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ (Vehicle Registration) చేస్తారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) తెలిపారు. ‘కొత్తగా వాహనం కొన్నవారు రిజిస్టేషన్ కోసం రవాణా శాఖ ఆఫీసుకి వెళ్లాల్సిన అవసరంలేదు. ఏ షోరూమ్‌లో వాహనం కొంటే అక్కడే శాశ్వత రిజిస్ట్రేషన్ చేస్తారు. వాహన శాఖలో అన్ని రకాల సేవలు ఆన్‌లైన్‌లోనే (Online Services) అందించేలా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సారథి(Sarathi)లో చేరింది. దీని ద్వారా రవాణా సేవలు, సౌకర్యాలు ప్రజలకు మరింత చేరువకానున్నాయి. రవాణా శాఖ ఈవీ పాలసీ, స్క్రాప్ పాలసీ తీసుకొచ్చింది. రవాణా శాఖ అనేక సంస్కరణలతో సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తెచ్చింది’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
Ponnam | నేటి నుంచి షోరూమ్‌ల్లోనే వాహనాల రిజిస్ట్రేషన్
By Aadab Desk
- Advertisement -
Previous article
