Thursday, February 26, 2026
Homeమెదక్‌Edupayala | ఏడుపాయల ఈఓ గా వీరేశం నియామకం

Edupayala | ఏడుపాయల ఈఓ గా వీరేశం నియామకం

  • వనదుర్గమ్మను దర్శించుకుని బాధ్యతల స్వీకరణ

ప్రఖ్యాతిగాంచిన ఏడుపాయల శ్రీ వన దుర్గా మాత దేవస్థానం కార్యనిర్వహణాధికారి (గ్రేడ్- 1 ఈఓ) గా ఎం. వీరేశం ను (పూర్తి అదనపు బాధ్యతలు) నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ ఈ. శ్రీనివాసరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈఓ వీరేశం బుధవారం ఏడుపాయల దేవస్థానం నందు బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ప్రస్తుతం పనిచేస్తున్న ఈఓ చంద్రశేఖర్ నూతనంగా నియామకమైన ఈఓ వీరేశంను స్వాగతించగా, అమ్మవారిని దర్శించుకున్న వీరేశం వనదుర్గ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాగా వీరేశం ప్రస్తుతం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని కుషాయిగూడ శ్రీ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం గ్రేడ్-1 ఈఓగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈఓ చంద్రశేఖర్ దేవాదాయ ధర్మాదాయ శాఖకు రంగారెడ్డి జిల్లా అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News