భారీ వర్షాలకు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం మంగళవారం రాత్రి కుప్పకూలింది. కడప జిల్లా కందిమల్లయ్యపలె గ్రామంలో ఉన్న ఆయన ఇల్లు దక్షిణ వైపు గోడ కూలిపోయింది. 1979, 1982లో ముగ్గురు యాత్రికులు పాత ఇంటి స్థానంలో గదులు, వరండాను రాతి కట్టడంతో నిర్మించారు. గోడ కూలిపోవడానికి మతం అధికారుల నిర్లక్ష్యమే కారణమని యాత్రికులు విమర్శిస్తున్నారు. టోకెన్ రూపంలో యాత్రికుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారే తప్ప కనీసం మరమ్మతులు కూడా చేయించకపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -
