- మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
వట్టిపల్లి యాదమ్మ అమృత ధార ట్రస్ట్ సేవలు అభినందనీయం అని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనాంపల్లి హనుమంతరావు అన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు కీర్తిశేషులు నరేష్ 37వ జయంతి సందర్భంగా వై వి ఎం ఎల్ అమృత ధార ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం మల్కాజిగిరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మైనంపల్లి హనుమంతరావు హాజరై రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ వైస్ చైర్మన్ మనోహర్, వారి కుటుంబ సభ్యులను మైనంపల్లి అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మునుముందు ఇంకా చేయాలని మంచి పని చేసే వారికి అంత మంచి జరుగుతుందని ప్రోత్సహించారు.
- Advertisement -
- Advertisement -
