- తేల్చి చెప్పిన భూ యజమానులు..
- ఈ భూముల వ్యవహారం కోర్టులో ఉంది, ఇక్కడ ఆక్రమణలు జరగలేదు
- కబ్జాలు అంతకంటే లేవు.
- కోర్టులో కేసు ఉండగా గోడ కట్టడంపై మేం అభ్యంతరం తెలిపాం.
- ఒకవైపే విని ఆరోపణలు చేయడం న్యాయమా? ఇరుపక్షాల వాదన విన్నాక మీరే తీర్పుచెప్పండి.
- దీనికి మంత్రి శ్రీనివాసరెడ్డికి ఏం సంబంధం?
వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 245 వ్యవసాయ భూమి లో జరుగుతున్న భూ వివాదానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గానీ వారి కుటుంబానికి గాని ఎలాంటి సంబంధం లేదని, రాఘవ కన్స్ట్రక్షన్స్ కు తాము ఏలాంటి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేయలేదని వట్టినాగులపల్లి యజమానులు స్పష్టం చేశారు. మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి తన అధికార బలాన్ని ఉపయోగించి స్థలాన్ని కబ్జా చేయడానికి యత్నిస్తున్నారనే బిఆర్ఎస్ నాయకుల ఆరోపణలో ఏమాత్రం వాస్తవం లేదు.
ఈ భూవివాదంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి ని, రాఘవ కన్స్ట్రక్షన్స్ ని ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు. మా కుటుంబానికి సంబంధించిన స్థలాల బౌండరీల విషయంలో మాకు వివాదం ఉంది. దీనికి సంబంధించిన విషయాలను పూర్తి ఆధారాలతో మీడియా ముందు ఉంచుతున్నాం.
కొందరు బిఆర్ఎస్ నాయకులు భూమి విలువపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదే భూమిని రూ.600 కోట్లకు భేషరతుగా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నాం. నిజంగా విలువ ఉంటే కొనుగోలు చేయడానికి సిద్ధమా అని ప్రశ్నించారు. వట్టినాగులపల్లి భూవ్యవహారంపై సోమవారం రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేఖరుల సమావేశంలో భూయజమానులు పూర్తి వివరాలను మీడియా ముందు ఉంచారు.

ఈ సమావేశంలో భూ యజమానులు అవినవ్ షా, సుధీర్ కుమార్ షా, అక్షయ్ షా , న్యూజెన్ డెవెలపర్స్ ఎండీ సిద్దార్ధ్ గాదె మాట్లాడుతూ… అవినవ్ షా, భూయజమాని రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలోని సర్వే నెంబర్ 259లో తనకు ఒక ఎకరం భూమి ఉందని, సతీష్ షా తనకు తండ్రి సమానులని అవినవ్ షా పేర్కొన్నారు.
గత పదేళ్లుగా ఆయన సలహాతోనే పని చేస్తున్నానని, భూమిని డెవలప్మెంట్కు ఇచ్చే ముందు కూడా ఆయనను సంప్రదించానని అన్నారు. ఇది కేవలం కుటుంబ వివాదమని, దీనిని ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావడం లేదని అవినవ్ షా ఆవేదన వ్యక్తం చేశారు. హరీశ్ రావు, కేటీఆర్ కేవలం ఒకవైపే కాకుండా తమ వాదన కూడా వినాలని కోరారు.
2020 నుంచి తాను భూ సర్వే చేయిస్తున్నానని, హైకోర్టు ఆదేశాల ప్రకారం సబ్ డివిజన్, డిమార్కేషన్ జరగాలని కోరుతున్నట్లు తెలిపారు. భువన్ యాప్ ద్వారా వివరాలు సరిచూసుకోవచ్చని, సర్వే చేయించి ఎవరి భూమి వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు.
సతీష్ షా ఆస్తిలో అక్రమ రోడ్డు నిర్మించారని, తాను ఆయనను బెదిరించానన్నది అబద్ధమని తెలిపారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఎవరిని పిలిచినా సరే, భూ సర్వే చేయించి నిజానిజాలు తేల్చాలని, అనవసరంగా కుటుంబంలో చీలికలు తీసుకురావద్దని ఆయన కోరారు. అక్షయ్ షా, భూయజమాని వ్యవస్థలను నిష్పక్షపాతంగా సర్వే చేయనివ్వాలని, ఇది పూర్తిగా కుటుంబ వివాదమని అక్షయ్ షా స్పష్టం చేశారు. రాజకీయ ప్రమేయం వద్దని తాము గతంలోనే కోరామని గుర్తు చేశారు. హరీశ్ రావు, కేటీఆర్ పట్ల గౌరవం ఉన్నప్పటికీ, వారు సతీష్ వైపు నిలిచి ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
తాము కేవలం సర్వే చేయించమని మాత్రమే కోరుతున్నామని, ఇందులో రాజకీయం ఎందుకని ప్రశ్నించారు. సరిహద్దులను తేల్చి ఎవరి భూమి వారికి అప్పగిస్తే సమస్య పరిష్కారమవుతుందని ఆయన పేర్కొన్నారు. సుధీర్ కుమార్ షా, భూయజమాని వట్టినాగులపల్లి భూమి తమ కుటుంబానికి చెందినదని, 1969 నుంచి ఈ ఆస్తి కుటుంబం మధ్యనే ఉందని సుధీర్ కుమార్ షా వివరించారు.
అన్నదమ్ముల మధ్య భూమి పంపకాల్లో కొంచెం తక్కువ, ఎక్కువ ఉండటం సహజమని, ఏడీ లేదా శాటిలైట్ సర్వే ద్వారా సరిహద్దులు తేలితే వివాదం ముగుస్తుందని చెప్పారు. సర్వే నెంబర్లు 245, 259, 262లలో సర్వే చేయిస్తే, ఎక్కువ ఉన్న వారు వదులుకుంటారని, తక్కువ ఉన్న వారు తీసుకుంటారని తెలిపారు.
తమ లక్ష్యం ఒక్కటేనని, భూమిని స్పష్టం చేసుకొని డెవలపర్‌కు ఇవ్వాలని ఆయన స్పష్టం చేశారు. సిద్ధార్థ గాదె, న్యూజెన్ కంపెనీ మేనేజింగ్ పార్టనర్ మాట్లాడుతూ… కేటీఆర్, హరీశ్ రావు వంటి నాయకులు ఏకపక్షంగా మాట్లాడటం సరికాదని సిద్ధార్థ గాదె అన్నారు. తాము కేవలం డెవలపర్స్ మాత్రమేనని, భూ యజమానులు ఇచ్చిన భూమిపై ప్రాజెక్ట్ చేస్తామని స్పష్టం చేశారు. షా కుటుంబ వివాదంతో తమకేం సంబంధమని రాజకీయ నేతలను ప్రశ్నించారు.
తమ సంస్థలో పొంగులేటి హర్ష ఒక పార్టనర్ మాత్రమేనని, రాజకీయంగా ఆయనను, మంత్రి పొంగులేటిని టార్గెట్ చేయడం వల్ల వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో తెలియదు కానీ తప్పుడు ప్రచారం వల్ల కంపెనీ ఇమేజ్ దెబ్బతినడంతో పాటు తమ ఉద్యోగులు, భాగస్వాములు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరును అనవసరంగా వివాదంలోకి లాగుతున్నారని, కాంట్రాక్ట్ తీసుకున్నది న్యూజెన్ కంపెనీ అని స్పష్టం చేశారు. కేటీఆర్ భూమి విలువ రూ.1200 కోట్లు అని చెబుతున్న వారు, అవినవ్ షా కు రూ.600 కోట్లు ఇస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటామని అన్నారని వెల్లడించారు. వివాదం కోర్టులో ఉండగా సతీష్ షా గోడ కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. కేటీఆర్ ఈ విషయాన్ని ప్రజాకోర్టులో పెట్టారు కాబట్టి, ఇరుపక్షాల వాదనలు విని ఆయనే జడ్జ్ చేయాలని, రాజకీయ ఎజెండాతో ఇతరులను ఇబ్బంది పెట్టవద్దని కోరారు.
