Saturday, February 21, 2026
Homeఆంధ్రప్రదేశ్T-Hubలో వాల్తాటి లక్ష్మీనారాయణకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

T-Hubలో వాల్తాటి లక్ష్మీనారాయణకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

జోగులంబ గద్వాల్ జిల్లా, అలంపూర్‌కు చెందిన ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగి వాల్తాటి లక్ష్మీనారాయణ, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్ క్యాంప్ 2.0ను విజయవంతంగా పూర్తి చేశారు. జూలై 26, 2025న హైదరాబాద్‌లోని T-Hub వేదికగా జరిగిన గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఇంపాక్ట్ వ్యవస్థాపకులు గంపా నాగేశ్వర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని వాల్తాటి లక్ష్మీనారాయణకు AI గ్రాడ్యుయేషన్ పట్టాను అందజేశారు.

ఈ సందర్భంగా వాల్తాటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, “తెలుగు AI బూట్ క్యాంప్ 2.0లో నేర్పిన AI టూల్స్‌ను ఆచరణాత్మకంగా ఉపయోగించడం ద్వారా నా సాంకేతిక నైపుణ్యాలు గణనీయంగా మెరుగయ్యాయి. ఈ శిక్షణ నా ఆరోగ్య శాఖలో ప్రభుత్వ ఉద్యోగ కార్యకలాపాలలో సృజనాత్మకతను మరింత పెంపొందించడంలో మరియు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవడంలో ఎంతో ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఈ అవకాశం కల్పించిన డిజిప్రెన్యూర్ టీమ్‌కు, నికీలు గుండ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు!” అని తెలిపారు.

- Advertisement -

తరువాతి తెలుగు AI బూట్ క్యాంప్ 2.0 ఆగస్టు 11, 2025న ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలకు ఈ నంబర్లను సంప్రదించండి: 733 111 2687, 733 111 2686, 733 111 2688.

- Advertisement -
RELATED ARTICLES

Latest News