- చీర్యాల ఆలయానికి పోటెత్తిన భక్తులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా చీర్యాల లక్ష్మీ నరసింహ స్వామిని అధిక సంఖ్యలో భక్తులు మంగళవారం దర్శించుకున్నారు. హరినామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. ఉదయం పంచామృత నవకలశాభిషేకం మరియు స్వామివారికి ఫౌండర్ మరియు చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ చేతుల మీదుగా తులసి లక్ష పుష్పార్చన సప్త హారతులు నిర్వహించారు. స్వామి వారిని సప్త ద్వారాల ద్వారా భక్తులు దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు.
స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు :
స్వామివారిని సిఎస్ నవీన్ మిట్టల్, మాజీ మంత్రి బాబు మోహన్, కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వసంత దర్శించుకున్నారు.
- Advertisement -
వైకుంఠ ఏకాదశి మహోత్సవానికి సహకరించిన పోలీస్, ట్రాఫిక్ పోలీస్, పారిశుద్ధ్య కార్మికులు, వాలంటరీ, మీడియాకి ఆలయ చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -
