Tuesday, February 17, 2026
Homeఎన్‌.ఆర్‌.ఐStudent Visa | మా కొద్దు బాబోయ్ ఈ అమెరికా చదువులు..

Student Visa | మా కొద్దు బాబోయ్ ఈ అమెరికా చదువులు..

  • ట్రంప్ నిర్ణయాలతో విద్యార్థిలోకం విల విల..
  • ఈ ఏడాది మరింత తగ్గిన వీసాలు..

అమెరికాలో చదవాలని ఎంతో మంది కలలు కంటారు. అందుకోసం చాలా కష్టపడి చదివి.. అర్హత పరీక్షలు రాస్తారు. ఈసారి కాకపోతే వచ్చేసారి అంటూ ఏళ్ల తరబడి అమెరికా యూనివర్సిటీల్లో అడ్మిషన్ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను అమెరికాలో చదివించాలనే బలమైన పట్టుదలతో ఉంటారు. కానీ.. ప్రస్తుతం ఆ కలలు మొత్తం కల్లలు అవుతున్నాయి.

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు, విధిస్తున్న ఆంక్షలు, ప్రస్తుతం అక్కడి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని.. అమెరికాలో చదవాలని భావించే భారత విద్యార్థులు.. వెనకడుగు వేస్తున్నారు. గతంలో కరోనా మహమ్మారి విస్తరించిన సమయంలో కంటే తక్కువగా.. ఈసారి స్టూడెంట్ వీసాలకు దరఖాస్తులు వచ్చినట్లు అమెరికా దౌత్య అధికారులు చెబుతున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

- Advertisement -

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలనే ఇండియన్ స్టూడెంట్స్ కలలు ఈ ఏడాది ఆరంభంలోనే సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా అమెరికా స్టూడెంట్ వీసాల సీజన్‌కు.. ప్రతీ ఏడాది మార్చి నుంచి జూలై నెలలు చాలా కీలకంగా ఉంటుంది. ఆగస్టు/సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యే ఫాల్ సెమిస్టర్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు.. మార్చి నుంచి జూలై మధ్య వీసాల కోసం భారీగా దరఖాస్తు చేసుకుంటారు.

అయితే తాజా గణాంకాలు భారతీయ విద్యార్థులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో జారీ అయిన ఎఫ్-1 (అకాడమిక్) (F-1 Visa) వీసాల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 27 శాతం తగ్గుదల నమోదైంది.

ఈ ఏడాది కేవలం 9,906 ఎఫ్-1 వీసాలు మాత్రమే భారతీయ విద్యార్థులకు జారీ అయ్యాయి. అంతకుముందు 2023లో ఇదే కాలంలో 14,987 వీసాలు జారీ కాగా.. 2024లో 13,478 వీసాలు భారతీయ విద్యార్థులు పొందారు. మరీ ముఖ్యంగా.. కొవిడ్-19 మహమ్మారి తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలు తిరిగి ప్రారంభమైన 2022 మార్చి నెల నుంచి మే నాటి 10,894 వీసాలతో పోలిస్తే.. ఈ ఏడాది మరింత తగ్గడం గమనార్హం

- Advertisement -
RELATED ARTICLES

Latest News