Tuesday, March 3, 2026
Homeఅంతర్జాతీయంShutdown | ముగింపు దిశగా..

Shutdown | ముగింపు దిశగా..

40 రోజుల పాటు నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు

  • పునరుద్ధరించే బిల్లుకు సెనేట్ ఆమోదం
  • హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదమే తరువాయి
  • 1981 నుంచి 15 సార్లు మూతపడ్డ ప్రభుత్వం
  • 2018-19 మధ్య దాదాపు 35 రోజులపాటు..
  • ఉద్యోగులకు బకాయిలు చెల్లించనున్న ప్రభుత్వం

అమెరికాలో నెలకొన్న ప్రభుత్వ షట్ డౌన్ మేఘాలు వీడిపోనున్నాయి. దీనికి అనుకూలంగా ఆ దేశ సెనెట్ ఓటింగ్ జరిగింది. కొందరు డెమోక్రాట్లు కూడా అనుకూలంగా ఓటు వేయడంతో 40 రోజుల పాటు నిలిచిపోయిన ప్రభుత్వ కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అమెరికా ప్రభుత్వానికి నిధుల విడుదలకు సంబంధించిన బిల్లులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్కు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మొదలైన షట్ డౌన్ ఆదివారం నాటికి 40వ రోజుకు చేరుకుంది.

- Advertisement -

దేశవ్యాప్తంగా విమాన సేవలకు అంతరాయం కలగడంతో ఈ ప్రతిష్టంభనను తొలగించడానికి సెనెటర్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షట్ డౌన్ ముగించే దిశగా తొలిఅడుగు పడింది. ట్రంప్, రిపబ్లికన్లు ప్రతిపాదించిన ఓ డీల్కు కొందరు డెమోక్రాట్లు సానుకూలంగా స్పందించారు. చివరి నిమిషంలో టెక్సాస్ సెనెటర్ జాన్ కార్నిన్ ఓటుతో తీర్మానానికి అనుకూలంగా 60 ఓట్లు వచ్చాయి. సెనెట్ రిపబ్లికన్ సభ్యుల సంఖ్య 53 కాగా.. డెమోక్రాట్ల సంఖ్య 45, ఇద్దరు స్వతంత్రులు ఉన్నారు.

అక్కడ బిల్లు ఆమోదం పొందాలంటే 60 ఓట్లు రావాలి. ఇప్పుడు కనీసం ఎనిమిది మంది డెమోక్రాట్లు మద్దతు ఇచ్చారు. అమెరికాలో షట్హౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. 1981 నుంచి అక్కడి ప్రభుత్వం 15 సార్లు మూతపడింది. 2018-19 మధ్య దాదాపు 35 రోజులపాటు మూతపడగా.. అప్పటికి అదే సుదీర్ఘ షట్హౌన్. ట్రంప్ హయాంలో ప్రభుత్వ సేవలు నిలిచిపోవడం ఇది మూడోసారి. ఇప్పుడు తాజా షట్హౌన్కు తెరపడే దిశగా అడుగులు పడ్డాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News