Saturday, March 28, 2026
Homeకెరీర్ న్యూస్462 ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్

462 ఉద్యోగాల భర్తీకి UPSC నోటిఫికేషన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) 462 ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం 54 రకాల పోస్టులు ఉన్నాయి. వెటర్నరీ అసిస్టెంట్ 18, డివిజనల్ మెడికల్ ఆఫీసర్ 14, డివిజనల్ మెడికల్ ఆఫీసర్(సైకియాట్రి) 26, మెడికల్ ఆఫీసర్(పీడియాట్రిక్స్) 11, డివిజనల్ మెడికల్ ఆఫీసర్(ఆర్థోపెడిక్స్) 19, డివిజనల్ మెడికల్ ఆఫీసర్(ఈఎన్టీ) 11, డివిజనల్ మెడికల్ ఆఫీసర్(ఆఫ్తాల్మాలజీ) 18, డివిజనల్ మెడికల్ ఆఫీసర్(ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ) 13, డివిజనల్ మెడికల్ ఆఫీసర్(జనరల్ సర్జరీ) 22, ఇదే హోదాలో జనరల్ మెడిసిన్ విభాగంలో 14, అనస్థీసియాలజీలో 13, అసిస్టెంట్ డైరెక్టర్ 11, అసిస్టెంట్ డైరెక్టర్ (Hosiery) 12, ఇదే హోదాలో ఫుడ్ విభాగంలో 17, కెమికల్ 11, అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్ 12, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మైన్స్ 36, డిప్యూటీ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ 13, స్పెషలిస్ట్ గ్రేడ్ 11, డిప్యూటీ ఆర్కిటెక్ట్ 16, కంపెనీ ప్రాసెక్యూటర్ 25 తదితర ఖాళీలు ఉన్నాయి. 2025 జూన్ 14 నుంచి జులై 3 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు upsconline.gov.inను సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News