సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు(Samajwadi Party President), ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం(Former Chief Minister of Uttar Pradesh), లోక్‌సభ సభ్యుడు (Lok Sabha Member) అఖిలేష్ యాదవ్.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఆయన.. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కొద్దిసేపు భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం.. అఖిలేష్‌కి వివరించారు. యాదవులు ఘనంగా జరుపుకునే సదర్ (Sadar) ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిన రేవంత్ రెడ్డిని ఆయన అభినందించారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా యాదవ సమాజం తెలంగాణ సీఎంను గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు. యాదవులకు ఇచ్చిన ప్రాధాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మీటింగ్‌లో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్‌తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Akhilesh Yadav | సీఎం రేవంత్‌తో భేటీ
- Advertisement -
RELATED ARTICLES
