బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
యూపీలోని అమేథిలో ఘటన
ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ సీనియర్ నేత(Bjp Senior Leader), జగ్‌దీష్‌పూర్ ఎమ్మెల్యే(Jagdishpur Mla) సురేష్ పాసి(Suresh Pasi) చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి. తనకు ముస్లిం ఓట్లు(Muslim Votes) వద్దంటూ ఆయన మాట్లాడిన 20 సెకన్ల వీడియో వైరల్‌గా మారింది. ‘నేనెప్పుడూ మసీదు(Mosque)కు వెళ్లను. గతంలో వెళ్లలేదు. భవిష్యత్తులో వెళ్లను. నేను ఓట్లు అడగడానికి వెళ్లను. వాళ్ల మంచీచెడుకు నేను హాజరుకాను. ఈ విషయంలో నేను చాలా క్లియర్‌గా ఉన్నాను’ అని అన్నారు. సురేష్ పాసి వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఇవి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు అని కాంగ్రెస్ తప్పుపట్టింది. ‘ఎన్నికలు దగ్గరపడుతున్నప్పుడు బీజేపీ లీడర్లు ఇలాగే మాట్లాడతారు. ఓట్ల కోసం అన్నదమ్ముల మధ్య, కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతుంటారు’ అని హస్తం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. సమాజంలో విద్వేషాలను పెంచిపోషించేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో బీజేపీ స్పందించింది. సురేష్ పాసి వ్యాఖ్యలతో పార్టీకి సంబంధంలేదని, అవి అతని వ్యక్తిగతమని స్పష్టం చేసింది.
