దేశంలోనే తొలి రాష్ట్ర స్థాయి క్వాంటం స్ట్రాటజీ(TQS)ని, క్వాంటం కోసం NITI ఆయోగ్ రూపొందించిన రోడ్‌మ్యాప్‌ను IIT హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఇది.. దేశంలోనే మొట్టమొదటి ‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్ నిలవటానికి దోహదపడుతుంది. #TelanganaRising2047కి అనుగుణంగా ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ఇందులోభాగంగా అత్యాధునిక పరిశోధన, సైబర్ భద్రత, లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణ, డీప్-టెక్ స్టార్టప్‌లు, తదుపరి తరం నైపుణ్యాలపై దృష్టి పెడతారు.
క్వాంటం టెక్నాలజీల్లో ఎక్సలెన్స్ సెంటర్, రూ.1,000 కోట్ల యంగ్ ఇండియా స్టార్టప్ ఫండ్.. పర్యావరణ వ్యవస్థను మరింత శక్తివంతం చేస్తాయి. దేశంలో అత్యంత అధునాతన క్వాంటం ఇన్నోవేషన్ హబ్‌ను నిర్మించడానికి తెలంగాణ తన నిబద్ధతను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో NITI ఆయోగ్, విద్యా సంస్థలు, పరిశ్రమలు, ప్రీమియర్ టెక్ సంస్థల నాయకులు పాల్గొన్నారు.
