కేంద్ర ప్రభుత్వం(Central Government) త్వరలో భారత్ ట్యాక్సీ సర్వీస్‌ను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి అమిత్‌షా(Amit Shah) ప్రకటించారు. ఈ సేవల ద్వారా వచ్చిన లాభాలను డ్రైవర్లకే(Profits to Drivers) ఇవ్వనున్నట్లు తెలిపారు. హర్యానాలోని పంచకులలో జరిగిన సహకార సమ్మేళనం(Sahakara Sammelan)లో కేంద్ర మంత్రి అమిత్‌షా ఈ ప్రకటన చేశారు. వినియోగదారుల సౌకర్యాన్ని(Customer Convenience), డ్రైవర్ల ఆదాయాన్ని(Drivers Income) పెంచేందుకు భారత్ ట్యాక్సీ సర్వీసును త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ(Union Ministry of Cooperation) ద్వారా ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటికే మన దేశంలోని పలు నగరాల్లో ఓలా(Ola), ఉబర్(Uber), ర్యాపిడో(Rapido) తదితర ప్రైవేట్ ట్యాక్సీ సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ ఈ కంపెనీల్లో లాభాలను ఎక్కువ శాతం యాజమాన్యాలే తీసుకుంటున్నాయని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
