Wednesday, March 11, 2026
Homeబిజినెస్VI | వీఐకి కేంద్ర ప్రభుత్వం ఊరట

VI | వీఐకి కేంద్ర ప్రభుత్వం ఊరట

ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా(Vodafone Idea)కి కేంద్ర ప్రభుత్వం(Union Government) ఊరట కలిగించింది. తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఆ కంపెనీకి సంబంధించిన రూ.87,695 కోట్ల బకాయిలను ఫ్రీజ్ చేస్తూ మంత్రివర్గం (Cabinet) నిర్ణయం తీసుకుంది. అడ్జెస్టెడ్ గ్రాస్ రెవెన్యూ(AGR)గా పేర్కొనే ఆ బకాయిల(Dues)ను పదేళ్లలో తిరిగి చెల్లించేలా రీషెడ్యూల్(Reshedule) చేసింది. రీషెడ్యూల్ ప్రకారం వీఐ సంస్థ ఈ బకాయిలను 2031-32 ఆర్థిక సంవత్సరం నుంచి 2040-41 ఆర్థిక సంవత్సరం మధ్య కాలంలో తిరిగి చెల్లిస్తే సరిపోతుంది. సుప్రీంకోర్టు(Supreme Court) 2020లో ఖరారు చేసిన 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన బకాయిలను 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో తిరిగి చెల్లించాలి. నియమనిబంధనల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ సంస్థలో ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్న నేపథ్యంలో సర్కారుకు నష్టం జరగకుండా ఉండేందుకు తాజా నిర్ణయం ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News