మహిళా జర్నలిస్టులు(Women Journalists), హక్కుల పరిరక్షకులు, కార్యకర్తల్లో (Activists) మూడింట రెండొంతుల మందిపై వయొలెన్స్ పెరిగింది. ఆఫ్‌లైన్(Offline)తోపాటు ఆన్‌లైన్(సోషల్ మీడియా-Social Media, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్-Artificial Intelligence)లోనూ వేధింపులు తగ్గటంలేదు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి (United Nations Organization) అనుబంధ సంస్థ ‘యూఎన్ ఉమెన్’ (UN Women) పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఒక అధ్యయనాన్ని ప్రచురించింది.
119 దేశాల నుంచి 6900 మంది బాధితులు వెల్లడించిన అభిప్రాయాలను క్రోడీకరించి ‘టిప్పింగ్ పాయింట్’ (Tipping Point) పేరుతో ఈ రిపోర్టును రూపొందించారు. 2021లో యునెస్కో కూడా ఇదే తరహా నివేదికను వెలువరించింది. అభిప్రాయాలను వెల్లడించినవారిలో 41 శాతం మంది తాము ఆఫ్‌లైన్ ఎటాక్‌లకు, వేధింపులకు గురైనట్లు చెప్పారు. వీటిని.. ఆన్‌లైన్ వయొలెన్స్‌తో ముడిపడి ఉన్న శారీరక లేదా లైంగిక దాడి, వెంటాడటం, మౌఖిక వేధింపులు, “స్వాటింగ్” వంటి రూపాల్లో ఎదుర్కొన్నామని తెలిపారు. గత ఐదేళ్లలో మహిళా జర్నలిస్టులపై ఆన్‌లైన్ వయొలెన్స్ రెట్టింపు కన్నా ఎక్కువ పెరిగింది.
