Friday, April 3, 2026
Homeకరీంనగర్Accident | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

Accident | రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

కరీంనగర్ బొమ్మకల్ బైపాస్ వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. వివరాలలోకి వెళితే నగరంలోని అజ్మత్పుర కు చెందిన అత్యాబ్ (21) అతని స్నేహితులు అబ్దుల్ రహమాన్ (19) అద్నాన్, అబ్రార్ నలుగురు కలిసి స్విఫ్ట్ డిజైర్ కారులో హౌసింగ్ బోర్డ్ కాలనీ వైపు నుండి బొమ్మకల్ బైపాస్ రోడ్డు వైపు వెళ్లుచుండగా వీ కన్వెన్షన్ దగ్గర అత్యబ్ వేగంగా నడుపుతూ అదుపుతప్పి ఎదురుగా ఆపి ఉన్న లారీని ఢీకొనగా కారు లోని నలుగురికి తీవ్ర గాయాలు కాగా వెంటనే సయ్యద్ అత్యాబును చల్మడ ఆసుపత్రికి మరియు మిగతా ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రి కరీంనగర్ కు తరలించగా రాత్రి 11 గంటలకు సయ్యద్ అత్యాబ్ మరణించినట్లుగా డాక్టర్లు తెలిపినారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అబ్దుల్ రహమాన్ రాత్రి ఒంటి గంట సమయంలో మరణించినట్లు డాక్టర్లు తెలిపినారు మిగిలిన అద్నాన్, అబ్రార్ కు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . మృతులైన సయ్యద్ అత్యాబ్ బీటెక్ అబ్దుల్ రెహమాన్ గాయపడిన ఇద్దరు బీటెక్, ఇంటర్మీడియట్ చదువుతున్నారు

- Advertisement -

మృతుల కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని ప్రభుత్వాసుపత్రిలో మృతుల శవములను శవ పరీక్ష జరిపించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు ప్రమాదం జరిగిన ప్రదేశమును కరీంనగర్ సిపి గౌస్ఆలం రూరల్ ఏసిపి విజయ్ కుమార్ పరిశీలించినారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News