Friday, October 3, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుతూంకుంట మునిసిపాలిటీలో ఏసీబీకి చిక్కిన ఇద్దరు లంచావతారులు

తూంకుంట మునిసిపాలిటీలో ఏసీబీకి చిక్కిన ఇద్దరు లంచావతారులు

తూంకుంట మునిసిపాలిటీ ఆఫీసులో బిల్‌ కలెక్టర్‌గా చేస్తున్న కె.రామ్‌రెడ్డి, కంప్యూటర్‌ ఆపరేటర్‌గా వ్యవహరిస్తున్న ఎ.శ్రావణ్‌ అవినీతి అధికారులకు చిక్కారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు. ఇంటికి సంబంధించిన మ్యుటేషన్‌ ప్రక్రియను పూర్తిచేసేందుకు రామ్‌రెడ్డి డబ్బులు డిమాండ్‌ చేశాడు. ఆ మొత్తాన్ని శ్రావణ్‌ ద్వారా చేజిక్కించుకునే సమయంలో పట్టుబడ్డాడు. రామ్‌రెడ్డి శామీర్‌పేట వార్డ్‌ ఆఫీసులో బిల్‌ కలెక్టర్‌గా చేస్తున్నాడు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని, నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తామని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News