Friday, February 13, 2026
Homeకెరీర్ న్యూస్Tgsrtc | టీజీఎస్ఆర్టీసీలో 198 ఉద్యోగాలు

Tgsrtc | టీజీఎస్ఆర్టీసీలో 198 ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(Tgsrtc)లో 198 ఉద్యోగాల నియామకానికి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (Tslprb) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ(Traffic Supervisor Trainee) పోస్టులు 84, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ(Mechanical Supervisor Trainee) పోస్టులు 114 ఉన్నాయి. ఈ రెండు రకాల ఉద్యోగాలకూ వేతనం రూ.27,080 నుంచి రూ.81,400 వరకు ఇస్తారు. 2025 డిసెంబర్ 30 నుంచి 2026 జనవరి 20వ తేదీ సాయంత్రంం 5 గంటల లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ట్రాఫిక్ సూపర్‌వైజర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు. మెకానికల్ సూపర్‌వైజర్ పోస్టులకు ఆటోమొబైల్(Automobile) లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉండాలి. 200 మార్కులకు నిర్వహించే రాత పరీక్ష(Written Test) ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు www.tgprb.inను సందర్శించొచ్చు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News