Wednesday, September 10, 2025
ePaper
spot_img
Homeఆజ్ కీ బాత్ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం..?

ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం..?

ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించడం పై
నాయకులే చేరని బడిలో, వైద్యం చేయించుకోని ఆసుపత్రిలో,
ప్రజలకు నమ్మకం ఎలా పుట్టుకొచ్చు?
పత్రికా ప్రకటనలో, గొప్ప మాటలు చెప్పినంత మాత్రాన,
వాస్తవం మారదు కదా, ప్రజల మనసులు గెలవదు.
తమ బిడ్డలను సర్కారీ బడికి పంపని నేతలు,
తమ రోగానికి ప్రభుత్వ వైద్యశాలను ఆశ్రయించని అధికారులు,
ఆదర్శంగా నిలవని పాలకులు ఉన్నచోట,
సామాన్యులకు వ్యవస్థపై నమ్మకం ఎలా కుదురుతుంది?
వారి ఆచరణే మార్గదర్శకం కావాలి..
అప్పుడే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది.

  • జ్వాల‌
RELATED ARTICLES
- Advertisment -

Latest News