- దొరా, ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చిండు
- రాష్ట్రంలో జిల్లాలో గత 10 ఏళ్లు దోచుకొని మెడలు తిరగకుండా బలిసారు
- ఓట్లు మనవి సీట్లు వారివా ? వాళ్లను ప్రశ్నిస్తే హత్యలు, కేసులు
- మెజార్టీ ప్రజల పక్షాన టిఆర్పి పోరాడుతుంది
- రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్
- వట్టే కు సూర్యాపేటలో ఘన స్వాగతం
అగ్రవర్ణాల కుట్రలు ఇక సాగనీయం. బీసీలు ఏకమైనారని తెలిసి పార్టీ ని ప్రకట చేయకుండా అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు చేశారని రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ అన్నారు. రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా వట్టే జానయ్యని ప్రకటించిన తర్వాత మొదటిసారిగా తన సొంత నియోజకవర్గమైన సూర్యాపేట జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా సోమవారం బీసీ.ఎస్టీ.మైనార్టీ కులాలవారు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి నేరుగా గాంధీనగర్ లో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి గుడికి వెళ్లి అక్కడ పూజలు నిర్వహించి, ఎన్టీఆర్ పార్కు నుండి కొత్త బస్టాండ్ వద్దకు పెద్ద ఎత్తున బోనాలు డబ్బులతో ర్యాలీ నిర్వహించి, కొత్త బస్టాండ్ వద్ద ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో సగానికి పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గత 70 సంవత్సరాలుగా వెనకబడితే ప్రత్యేక తెలంగాణలో బతుకులు బాగుపడతాయనీ ఎంతోమంది ఆత్మబలి దానాలు చేసుకొని ప్రత్యేక తెలంగాణ సాధించి దొర చేతికి అప్పగిస్తే, ధనిక రాష్ట్రాన్ని దరిద్ర రాష్ట్రంగా మార్చిండు అన్నారు.

బీసీలకు ప్రత్యేక పార్టీ వస్తేనే బతుకులు బాగుపడతాయని ప్రశ్నించే తీన్మార్ మల్లన్న పై వందల కేసులు పెట్టినా భయపడకుండా నేడు తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించాడు అని అన్నారు. మనమంతా ఆలోచన చేయాలి. 95% ఉన్న బీసీలు ఎవరికి వేస్తున్న మన ఓట్లు అనేది ఆలోచించాలని , ఓట్లు మనవి సీట్లు వారివా.? వాళ్లను ప్రశ్నిస్తే హత్యలు కేసులు పెట్టి, ఆ ప్రాంతాల్లో లేకుండా చేస్తారు అన్నారు. హైదరాబాదులో ఫ్లెక్సీలు చించి, హోటల్ తాజ్ కృష్ణ యాజమాన్యం బెదిరించారు అన్నారు. నాలుగు శాతం ఉన్న వీళ్లు పాలన చేస్తే మన బతుకులు ఎలా ఉన్నాయో ఆలోచించాలన్నారు. తెలంగాణలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై ఏకమవుతున్నామని కుట్రలు చేస్తున్నారని, నాడు అక్షర జ్ఞానం లేదు. నేడు అందరి చేతుల్లో ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్నాయి. మెజార్టీ ఓట్లు మనవి. మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యాధికారం రాధా అని ప్రశ్నించారు.
సూర్యాపేటలో ర్యాలీ అనగానే 33 యాక్ట్ తెచ్చి, ఇబ్బందులు పెట్టే పరిస్థితి చోటామోటా నాయకులు
ప్రయత్నాలు చేశారన్నారు. మన బతుకులు ఎటు పోతున్నాయో ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు కాంట్రాక్టులు. బీసీలకు అసెంబ్లీ స్థానాలు ఇస్తామని మోసం చేసినందుకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో జిల్లాలో గత 10 ఏళ్లు దోచుకొని మెడలు తిరగకుండా బలిసారు. వార్డు మెంబర్లుగా గెలవ లేని వాళ్ళు ఎగిరేగిరే పడుతున్నారని, క్లబ్బులు పబ్బులు అన్ని వారివే. మీరంతా (బీసీ అభ్యర్థులకు) ఓట్లు వేస్తామని మాట ఇవ్వాలి. రాబోయే ఎన్నికల్లో టి ఆర్ పి పార్టీ నీ అధికారంలో కి తీసుకొచ్చేందుకు సహకారం అందించాలి. రాష్ట్ర బడ్జెట్ మూడున్నర లక్షల కోట్లు అయితే, బీసీలకు లక్షన్నర కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉండగా, 20వేల కోట్లు కూడా ఖర్చు చేయడం లేదున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలన్నీ అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నాయని, గొంతేత్తిన అనేకమంది వీరులను పొట్టన పెట్టుకున్నారు అన్నారు. రాష్ట్రంలో మెజార్టీ ప్రజల పక్షాన టిఆర్పి పోరాడుతుంది. ఇది మన పార్టీ మన అందరి పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్పి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
