అక్టోబర్‌లో జరిగిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల విలువ రూ.27.28 లక్షల కోట్లకు చేరింది. మొత్తం ట్రాన్సాక్షన్ల సంఖ్య 2 వేల 70 కోట్లు. 2016లో యూపీఐ సర్వీసులు ప్రారంభమయ్యాక ఒక నెలలో ఈ రేంజ్‌లో లావాదేవీలు (Transactions) జరగటం ఇదే తొలిసారి. ఈ విషయాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) వెల్లడించింది. జీఎస్టీ రేట్లు (Gst Rates) తగ్గటం, పండగ సీజన్ (Festival Season) తోడవటంతో ఈ రికార్డులు నమోదయ్యాయి. సెప్టెంబర్‌లో 1963 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరిగాయి. వీటి వ్యాల్యూ రూ.24.9 లక్షల కోట్లు. వీటి కన్నా అక్టోబర్‌లో 5.6 శాతం ఎక్కువ లావాదేవీలు చోటుచేసుకున్నాయి. విలువ పరంగా 16 శాతం డెవలప్‌మెంట్ జరిగింది.
- Advertisement -
