Friday, February 27, 2026
Homeరంగారెడ్డిBSP | కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు బహుజన పార్టీలు కావు.

BSP | కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు బహుజన పార్టీలు కావు.

  • TPCC పోచారం SC సెల్ కన్వీనర్ BSP లో చేరిక.
  • కాంగ్రెస్ పార్టీలో బహుజనులను అనగదొక్కుతున్నారు. వల్లమల్ల ప్రవీణ్

TPCC పోచారం Sc సెల్ కన్వీనర్ వల్లమల్ల ప్రవీణ్ గారు బెహెన్ కుమారి మాయవతి పుట్టినరోజు సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రహీం శేఖర్ ఆధ్వర్యంలో 500 మంది కార్యకర్తలతో బహుజన్ సమాజ్ పార్టీలో చేరడం జరిగింది..
కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపులేదని అసహనం వ్యక్తం చేశారు. అనేక మంది పోరాటాలు, ప్రాణ త్యాగాలతో రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, అగ్రకుల నాయకులు పాలిస్తూ బహుజనులను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ప్రవీణ్ మండిపడ్డారు..

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఇంచార్జీ లు పల్లాటి రాములు, రవి ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి గ్యార మల్లేష్, అసెంబ్లీ ఇంచార్జీ లు కృష్ణ ప్రసాద్, మహేందర్, సోషల్ మీడియా కన్వీనర్ యంజాల ప్రహ్లాద్, జిల్లా మహిళా కన్వీనర్ శాంత, ఇందుమతి, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ అధ్యక్షుడు గుండె శ్రీనివాస్, చిత్రం కృష్ణ, పట్నం రమేష్ కురుమ , బాబు, జిల్లా, అసెంబ్లీ, మండల, మున్సిపాలిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News